AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహారం తిన్న వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు? ఆసక్తికర విషయాలు మీకోసం..

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం అనేది.. సాధారణ అలవాటు.. అయితే, తిన్న వెంటనే నీళ్లు తాగితే.. అది మీ ఆరోగ్యానికి హానికలిగిస్తుందని పేర్కొంటున్నారు.. ఆయుర్వేదం ప్రకారం, భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. భోజనం తిన్నాక నీరు ఎందుకు తాగకూడదు.. అనే విషయానికొస్తే.. ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణరసాలు పలుచగా మారతాయి. […]

ఆహారం తిన్న వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు? ఆసక్తికర విషయాలు మీకోసం..
Water After Meal
Shaik Madar Saheb
|

Updated on: Aug 17, 2024 | 1:14 PM

Share

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం అనేది.. సాధారణ అలవాటు.. అయితే, తిన్న వెంటనే నీళ్లు తాగితే.. అది మీ ఆరోగ్యానికి హానికలిగిస్తుందని పేర్కొంటున్నారు.. ఆయుర్వేదం ప్రకారం, భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. భోజనం తిన్నాక నీరు ఎందుకు తాగకూడదు.. అనే విషయానికొస్తే.. ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణరసాలు పలుచగా మారతాయి. దీనివల్ల జీర్ణక్రియ సవ్యంగా సాగదు. అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.. అందుకే.. తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల మీ శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి..

జీర్ణవ్యవస్థపై ప్రభావం: మీరు ఆహారం తిన్నప్పుడు, మీ శరీరంలో జీర్ణక్రియ సంక్లిష్ట ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆహారం జీర్ణం కావడానికి శరీరం ఎంజైమ్‌లు, ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. మీరు ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగితే, అది ఎంజైములు, ఆమ్లాలను పలుచన చేస్తుంది. దీని వలన ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల అపానవాయువు, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.

బరువు పెరుగుతుంది: ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగడం ద్వారా, మీరు ఎక్కువ ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంది.. తిన్న వెంటనే నీరు తాగడం వల్ల .. మీ కడుపు బాగా నిండిపోతుంది.. కానీ కొంత సమయం తర్వాత ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో మళ్లీ ఆకలిగా అనిపించడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా మీరు ఎక్కువగా తింటారు.. దీని వలన బరువు పెరుగుతారు.

పోషకాల శోషణ క్షీణిస్తుంది: నీరు ఆహారంలో ఉండే పోషకాలను పలుచన చేస్తుంది. దీని కారణంగా శరీరం వాటిని సరిగ్గా గ్రహించదు. దీని కారణంగా, మీరు పోషకాల లోపంతో బాధపడవచ్చు. ఇంకా అనేక వ్యాధుల బారిన పడవచ్చని పేర్కొంటున్నారు.

తిన్న తర్వాత నీరు ఎప్పుడు తాగాలి?

తిన్న అరగంట తర్వాత నీరు తాగాలి.. ఈ సమయంలో, ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ ప్రారంభమవుతుంది.. నీరు మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా మలబద్దకాన్ని కూడా నివారిస్తుందని పేర్కొంటున్నారు.

(గమనిక : ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి