Heart Attack: యువతకు గుండెపోటు ఎందుకు వస్తుంది..? దానిని నివారించడం ఎలా..?

Heart Attack: ఇటీవల కాలంలో గుండెపోటుతు మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎంతో మంది సినీ స్టార్స్‌ కూడా గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే..

Heart Attack: యువతకు గుండెపోటు ఎందుకు వస్తుంది..? దానిని నివారించడం ఎలా..?
Heart Attack
Follow us
Subhash Goud

|

Updated on: Jul 23, 2022 | 8:41 PM

Heart Attack: ఇటీవల కాలంలో గుండెపోటుతు మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎంతో మంది సినీ స్టార్స్‌ కూడా గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే యువతలో గుండెపోటు కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో యువతలో గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయి.. దాని నుండి రక్షించువడం ఎలా అనే విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

  1. ఒత్తిడి: బాధ్యతల భారం లేదా ఇతర కారణాల వల్ల, ఎవరైనా ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటారు. ఒత్తిడి పెరిగితే అది డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుంది. చాలా సందర్భాలలో, యువతలో ఒత్తిడి కారణంగా గుండెపోటు వస్తుంది.
  2. ఆహారం: ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో చాలా మంది యువత తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. చాలా సార్లు ప్రజలు బయటి నుంచి జంక్ ఫుడ్‌, ఆయిల్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ రకమైన ఆహారం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అధిక బీపీ, ఇతర సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  3. జీవనశైలి: నేటి యువతలో చాలా మంది జీవనశైలి చాలా చెడిపోయింది. సరైన సమయంలో నిద్రపోకపోవడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బిజీ షెడ్యూల్ కారణంగా యువత తమ జీవనశైలిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అయితే ఈ పొరపాటు మిమ్మల్ని గుండెపోటు పేషెంట్‌గా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  4. నివారించేందుకు మార్గాలు: చురుకుగా ఉండండి: మీరు ఎంత బిజీగా ఉన్న చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇంట్లోనే ఉండి వ్యాయమం, యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. యోగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మానసికంగా కూడా ప్రశాంతతను అందిస్తుంది. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తినండి. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తినండి, ఎక్కువ నీరు తాగండి.
  5. ఇవి కూడా చదవండి
  6. హెల్త్ చెకప్: ప్రతి వ్యక్తి సమయానుసారంగా 30 ఏళ్ల తర్వాత ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి. ఈ వయసు తర్వాత యువతలో గుండెపోటు కేసులు ఎక్కువగా వస్తున్నాయి. బాడీ చెకప్‌ ద్వారా అనారోగ్య సమస్యలను తొలగించుకోవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి