AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy: గర్భిణీలు ఎలాంటి ఆహారం తినాలి.. ఇలాంటి వాటితో జర భద్రం..!

కడుపులోని శిశువు సరిగ్గా పెరుగుతుంది. మీ పోషకాహార అవసరాలను తీర్చడానికి, మీరు పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి. కానీ, గర్భధారణను ప్రభావితం చేసేవి కొన్ని ఉంటాయి.

Pregnancy: గర్భిణీలు ఎలాంటి ఆహారం తినాలి.. ఇలాంటి వాటితో జర భద్రం..!
Pregnancy Food
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2022 | 7:48 PM

Share

Pregnancy: గర్భధారణ సమయంలో కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని చెబుతుంటారు పెద్దలు. ఎందుకంటే అలాంటివి మీ ఆరోగ్యంతో పాటు మీ శిశువు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటేనే..ఆరోగ్యకరమైన గర్భధారణను కలిగి ఉంటారు. కడుపులోని శిశువు సరిగ్గా పెరుగుతుంది. మీ పోషకాహార అవసరాలను తీర్చడానికి, మీరు పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి. కానీ, గర్భధారణను ప్రభావితం చేసేవి కొన్ని ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

చింతపండు: గర్భధారణ సమయంలో చింతపండును తినాలనే కోరిక కలగడం చాలా సహజం. కానీ గర్భిణులు చింతపండును తినడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే సైడ్ ఎఫెక్ట్స్ యే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి చింతపండులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. దీనిని అధికంగా తీసుకుంటే ఇది మీ శరీరంలో ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. అలాగే ప్రొజెస్టెరాన్ యొక్క తక్కువ స్థాయిలు గర్భస్రావానికి దారితీస్తాయి. కాబట్టి మీరు ఎక్కువగా చింతపండును తినకండి. మొదటి 6 నెలల్లో చింతపండును అస్సలు తినకుండ ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఖర్జూరం: ఖర్జూరాల్లో విటమిన్లు, శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే గర్భిణులు వీటిని ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఎందుకంటే అవి శరీరాన్ని వేడెక్కించి గర్భాశయ సంకోచాలకు కూడా దారితీస్తాయి. కాబట్టి రోజూ ఒకటి లేదా రెండు ఖర్జూరాలను మాత్రమే తినడం మంచిది. అంతకంటే ఎక్కువ తింటే గర్బస్రావం అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

అధిక పాదరసం కలిగిన చేప: ఇది మీ నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, మూత్రపిండాలకు విషపూరితం కావచ్చు. ఇది పిల్లలలో తీవ్రమైన అభివృద్ధి సమస్యలను కూడా కలిగిస్తుంది. తక్కువ మొత్తంలో కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఇది కలుషితమైన నీరు, సముద్రాలలో పెరుగుతుంటాయి. పెద్ద సముద్ర చేపల్లో అధిక మొత్తంలో పాదరసం పేరుకుపోతాయి.

బొప్పాయి:

గర్భిణీ స్త్రీలు తినకూడని పండ్లలో బొప్పాయి ఒకటి. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది గర్భధారణ సమయంలో అస్సలు మంచిది కాదు. దీనిలో latex సమృద్ధిగా ఉంటుంది. ఇది గర్భాశయ సంకోచానికి గురై రక్తస్రావానికి దారితీస్తుంది. ఇది పిండం ఎదుగుదలను కూడా నిరోధించగలదు. కాబట్టి పండిన, ముడి బొప్పాయి రెండింటినీ తినడం మానుకోండి.

పచ్చి గుడ్లు: పచ్చి గుడ్లు.. జ్వరం, వికారం, వాంతులు, కడుపు తిమ్మిరి, విరేచనాలకు కారణమవుతాయి. అయినప్పటికీ, అరుదైన సందర్భాల్లో ఇన్ఫెక్షన్ గర్భాశయంలో తిమ్మిరిని కలిగిస్తుంది. ఇది అకాల పుట్టుక లేదా మృత శిశువుకు దారితీస్తుంది.

అరటిపండ్లు: గర్భధారణ సమయంలో అరటిపండ్లు తినడం సురక్షితం అని భావించినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో వీటిని తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలర్జీలతో బాధపడే మహిళలు, డయాబెటిస్ లేదా డయాబెటిస్ కుటుంబ చరిత్ర ఉన్న మహిళలు అరటిపండ్లను తినకూడదు. అరటిపండ్లలో కూడా ఎక్కువ మొత్తంలో చక్కెర ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు అరటిపండ్లు తినడం మానుకోవాలి.

ఇక కడుపులో పెరిగే బిడ్డకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఇది బద్ద నాడీ వ్యవస్థకు, వెన్నెముక పెరుగుదలకు, బ్రెయిన్ పెరుగుదలకు చాలా అవసరం. అందుకే ఈ సమయంలో అరటిపండ్లను తప్పకుండ తినాలి. అంతేకాదు ఈ సమయంలో మలబద్దకం సమస్య వేధిస్తుంది. ఆ సమస్యలకు కూడా అరటిపండు తగ్గిస్తుంది. అరటిపండ్లలో ఉండే క్యాల్షియం లోపల బిడ్డ ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి