- Telugu News Health Health Tips: weight gain add these things in milk while drinking and get healthy weight gain | Telugu Health News
Weight Gain: మీరు సన్నబడటం వల్ల ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయడం వల్ల బరువు పెరుగుతారు
Weight Gain: ప్రస్తుతం ఎంతో మంది బరువు తగ్గడం లేదని బాధపడుతుంటే.. మరికొంత మంది బరువు పెరగాలని, సన్నగా ఉన్నామని బాధపడుతుంటారు. కొంతమందికి సన్నగా ఉండటం కూడా ఇబ్బందే...
Updated on: Jul 23, 2022 | 9:07 PM

Weight Gain: ప్రస్తుతం ఎంతో మంది బరువు తగ్గడం లేదని బాధపడుతుంటే.. మరికొంత మంది బరువు పెరగాలని, సన్నగా ఉన్నామని బాధపడుతుంటారు. కొంతమందికి సన్నగా ఉండటం కూడా ఇబ్బందే. రాత్రిపూట పాలు తాగితే, దానికి కొన్ని పదార్థాలను జోడించడం ద్వారా మీ బరువు పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

పాలు, అత్తి పండ్లు ఎంతో బలాన్ని ఇస్తాయి. ఆయుర్వేదంలో దీనికి విశేష ప్రాధాన్యం ఉంది. పాలను వేడి చేస్తున్నప్పుడు అందులో అంజీర పండ్ల ముక్కలను వేసి గోరువెచ్చగా తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పాలు, బాదం: పాలు, బాదం, జీడి పప్పు ఎంతో బలాన్నిస్తాయి. పాలలో వీటిని కలుపుకొని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌ను సరిగ్గా తీసుకుంటే, వాటి నుండి ఆరోగ్యకరమైన కొవ్వును పొందవచ్చు. వీటిని రాత్రి పడుకునే ముందు పాలలో జోడించి తాగడం మంచిదంటున్నారు.

పాలు, మఖానా: మఖానాలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మీ బరువును ఆరోగ్యకరమైన రీతిలో పెంచడానికి పని చేస్తాయి. దీన్ని పాలలో కలుపుకుని తింటే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు మీ పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

పాలు, ఖర్జూరం: ఖర్జూరాలలో పిండి పదార్థాలు, కేలరీలు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగాలంటే రాత్రి పడుకునే ముందు పాలల్లో ఖర్జూరం నానబెట్టి తీసుకోవడం ఎంతో మంచిది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల పొట్టకు కూడా మేలు చేస్తుంది.





























