Healthy Foods: జీర్ణవ్యవస్థ బాగుండాలంటే ఇవి తప్పక తినాల్సిందే.. అవి ఏవేవో తెలుసుకోండి!

Digestion Foods: మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు తినే ఆహార పదార్థాలపై కన్నేయాల్సిందే. లేదంటే చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే జీర్ణక్రియను మెరుగుపరిచే ఆరోగ్యకరమైన ఆహారాలను కచ్చితంగా ఆహారంలో చేర్చాలి.

Healthy Foods: జీర్ణవ్యవస్థ బాగుండాలంటే ఇవి తప్పక తినాల్సిందే.. అవి ఏవేవో తెలుసుకోండి!
Digestion Problems
Follow us
Venkata Chari

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 31, 2021 | 12:19 PM

Healthy Foods: ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతో ముఖ్యం. జీర్ణశక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉంటే.. శరీరానికి శక్తి, రోగనిరోధక శక్తితోపాటు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే జీర్ణక్రియను మెరుగుపరిచే ఆహారాలను మీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను తెలుసుకుందాం..

పెరుగు – మంచి జీర్ణవ్యవస్థ కోసం తినగలిగే ఉత్తమమైన వాటిలో పెరుగు మొదటి స్థానంలో ఉంటుంది. మీ జీర్ణక్రియకు పెరుగు ఎంతో ఉపయోగపడుతోంది. ఆహార జీర్ణక్రియకు సహాయపడే మంచి బ్యాక్టీరియా పెరుగులో ఉంటుంది. విరేచనాలను తగ్గించడంలోనూ పెరుగు సహాయపడుతుంది. భోజనం లేదా డిన్నర్‌లో ఒక గిన్నె పెరుగును తప్పకుండా తీసుకుంటే, మీరు తిన్న ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి చక్కగా పనిచేస్తుంది.

బొప్పాయి – బొప్పాయి కూడా జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. బొప్పాయిలో విటమిన్ ఏ, బీ, సీ పుష్కలంగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరంలోని అన్ని హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను కూడా నివారిస్తుంది.

జీలకర్ర – మన భారతీయ వంటకాలలో జీలకర్రను ఉపయోగించడం అలవాటే. ఇది ఆహారానికి భిన్నమైన రుచిని జోడించడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రలో యాంటీమైక్రోబయల్, యాంటీ డయాబెటిక్‌తో పాటు యాంటీ కాన్సర్ లక్షణాలు ఉన్నాయి.

యాపిల్ – జీర్ణక్రియకు ఉపయోగపడే మరో పండు యాపిల్. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఈ పండులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరిచేందుకు ఎంతో మేలు చేస్తాయి. రోజూ యాపిల్ తినడం వల్ల మన శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మరింత సాఫీగా చేస్తుంది. మీరు యాపిల్‌ను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. మీ రోజువారీ ఆహారంలో లేదా చిరుతిండిగాను తీసుకోవచ్చు.

తృణధాన్యాలు – జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉండాలంటే.. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలలో మొదటగా ఉండేవి తృణధాన్యాలు మాత్రమే. ఇవి మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తాయి. అలాగే ఆహారంలో బ్రెడ్, చపాతీ, బ్రౌన్ రైస్, ఓట్స్ చేర్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

Also Read: Noni fruit: ఈ అద్భుత ఫలం 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేయగలదు..

Health Tips: శ్రావణ మాసంలో పాలు, పెరుగు తినకూడదా ? తింటే ఏం జరుగుతుందో తెలుసా..

తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా?
లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా?
మరికాసేపట్లో మెగా డీఎస్సీ సిలబస్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
మరికాసేపట్లో మెగా డీఎస్సీ సిలబస్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
నేడు తుఫాన్‌గా మారనున్న వాయుగుండం.. ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ
నేడు తుఫాన్‌గా మారనున్న వాయుగుండం.. ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ
ఆర్సీబీపై సిరాజ్‌ మియా పోస్ట్..కట్ చేస్తే.. సీన్‌లోకి రషిద్ ఖాన్
ఆర్సీబీపై సిరాజ్‌ మియా పోస్ట్..కట్ చేస్తే.. సీన్‌లోకి రషిద్ ఖాన్
Horoscope Today: ఉద్యోగంలో వారి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారి హోదా పెరిగే ఛాన్స్..
ఐపీఎల్ వేలంలో పృథ్వీ షాను కొనుగోలు చేయకపోవడానికి కారణం అదేనా?
ఐపీఎల్ వేలంలో పృథ్వీ షాను కొనుగోలు చేయకపోవడానికి కారణం అదేనా?
పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఉపయోగం లేనట్టేనా ??
పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఉపయోగం లేనట్టేనా ??