Noni fruit: ఈ అద్భుత ఫలం 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేయగలదు..

తొగరు ఫలం గురించి మీకు తెలుసా..? దీని ఆకులు, కాండం, పండ్ల జ్యూస్ అన్నీ ఔషధంగా ఉపయోగించబడతాయి. ఈ అద్భుత ఫలానికి 100...

Noni fruit: ఈ అద్భుత ఫలం 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేయగలదు..
Noni Fruit
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 31, 2021 | 8:49 AM

తొగరు ఫలం గురించి మీకు తెలుసా..? దీని ఆకులు, కాండం, పండ్ల జ్యూస్ అన్నీ ఔషధంగా ఉపయోగించబడతాయి. ఈ అద్భుత ఫలానికి 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేసే శక్తి ఉందని, దానిలో 150 కి పైగా పోషకాలు ఉన్నట్లు పెద్దలు చెబుతారు. దీనిని సేవిస్తే, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని కూడా నివారించవచ్చని నమ్ముతారు. మీరు మార్కెట్లో సులభంగా తొగరు పండ్లను పొందవచ్చు. ఈ పండు వలన ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

1. ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు ప్రజలు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిల్లో, మీరు తొగరు జ్యూస్ గురించి తెలుసుకోవడం చాలా ఉపయోగకరం. దీన్ని మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది.

2. తొగరు జ్యూస్‌లో యాంటీ-ఒబేసిటీ గుణాలు ఉంటాయి. కాబట్టి త్వరగా బరువు తగ్గాలనుకునే వ్యక్తులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఊబకాయం తగ్గితే, చాలా వ్యాధులకు చెక్ పెట్టినట్లే అని డాక్టర్లే చెబుతారన్న విషయం తెలిసిందే.

3. తొగరు జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.  దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. అలాగే సాధారణ ప్రజలను షుగర్ వ్యాధి బారిన పడకుండా కూడా కాపాడుతుంది.

4. తొగరు ఫలంలో బీటా-గ్లూకాన్స్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ క్రమంలో తొగరు ఫలం జ్యూస్ సేవించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్,  రొమ్ము క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు తెలిపారు. అదనంగా, ఇది సాధారణ క్యాన్సర్ నుంచి కూడా రక్షణ ఇస్తుంది.

5. సంతానలేమి సమస్యను తొలగించడంలో కూడా తొగర  చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం ద్వారా పురుషుల్లో నపుంసకత్వం, మహిళల్లో వంధ్యత్వం సమస్యను అధిగమించవచ్చు. ఇది పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెంచడానికి.. మహిళల పీరియడ్స్ సమస్యను అధిగమించడానికి కూడా పనిచేస్తుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తొగరు జ్యూస్ తాగకూడదు

హై బీపీ సమస్యతో మెడిసిన్ తీసుకుంటుంటే డాక్టర్ల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ఈ జ్యూస్ సేవించాలి

(దుష్ప్రభావాలు నివారించేందుకు, మీరు ఈ జ్యూస్ గురించి ఒక ఆయుర్వేద నిపుణుడు సంప్రదించటం ఉత్తమం)

Also Read: ఆ గ్రామంలో అడుగు బయటపెట్టని జనం.. క్షుద్రపూజల కలకలం.. రాత్రిళ్లు కోళ్లు బలి

ఏకంగా తెలంగాణ డీజీపీ ఫొటోతోనే చీటింగ్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు