Health Tips: శ్రావణ మాసంలో పాలు, పెరుగు తినకూడదా ? తింటే ఏం జరుగుతుందో తెలుసా..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jul 30, 2021 | 9:56 PM

సాధారణంగా శ్రావణ మాసంలో చాలా మంది మాంసం తినరు. ఇందుకు చాలానే కారణాలున్నాయనుకోండి.

Health Tips: శ్రావణ మాసంలో పాలు, పెరుగు తినకూడదా ? తింటే ఏం జరుగుతుందో తెలుసా..
Curd Milk

Follow us on

సాధారణంగా శ్రావణ మాసంలో చాలా మంది మాంసం తినరు. ఇందుకు చాలానే కారణాలున్నాయనుకోండి. ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రావణ మాసంలో ఎక్కువగా వరలక్ష్మీ అమ్మవారిని పూజించడం.. వ్రతాన్ని జరిపించుకోవడం ఆనవాయితీ. దీంతో చాలావరుకు ఈ నెలలో మాంసం ముట్టుకోవడానికి ఇష్టపడరు. అయితే మరికొందరు ఈ నెలలో పాలు, పెరుగు కూడా తినకూడదు అంటుంటారు. పాలు, పెరుగులలో అనేక రకాల పోషకాలుంటాయి. మరీ ఆరోగ్యానికి ప్రయోజనాలిచ్చే పాలు, పెరుగు శ్రావణ మాసంలో ఎందుకు తినకూడదో తెలుసుకుందామా.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. అలాగే వాతావరణంలో ఎన్నో రకాల కీటకాలు కూడా బ్యాక్టీరియాకు కూడా మొక్కలపై ఏర్పడుతుంటాయి. వాటిని తీసుకున్న గేదెలు, ఆవులు వర్షాకాలంలో ఎక్కుగా జబ్బు పడుతుంటాయి. అంతేకాకుండా.. పాలలో, పెరుగులో కూడా హనికరమైన కీటకాలు వచ్చే ప్రమాదముంటుందని.. అందుకే ఈ సీజన్‏లో ఎక్కువగా పాలు, పెరుగు తీసుకోకూడదని అంటుంటారు. అలాగే వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ తరచుగా బలహీనపడుతుంది. ఈ నెలలో పాలు, పెరుగు తీసుకోవడం వలన తరచుగా అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఎసిడిటి వంటి కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఈ నెలలో పాలు, పెరుగు, వాటి నుండి తయారైన వస్తువులను తినవద్దని సలహా ఇస్తారు. అలాగే వర్షాకాలంలో పాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం వలన జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో పాటు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటుంటారు.

Also Read:

శరీరంలో రక్తంలో తగ్గిపోతుందా ? అయితే అశ్రద్ధ చేయకండి.. సులభంగా వీటితో రక్తహీనతను జయించండి..

Health Tips : ఈ 7 ఆహార పదార్థాలు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు..! ఎందుకో తెలుసుకోండి..

Child Care Tips: ఓ వైపు కరోనా.. మరోవైపు సీజనల్ వ్యాధులు.. పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే

Vamaku Pacchadi: వాము ఆకుతో ఎన్నో ఆరోగ్యప్రయోజలు.. రుచికరమైన వామాకు నువ్వుల రోటి పచ్చడి తయారీ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu