Child Care Tips: ఓ వైపు కరోనా.. మరోవైపు సీజనల్ వ్యాధులు.. పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే

Child Care Tips: పిల్లలలు ఏ తల్లిదండ్రులకైనా ముద్దే.. వారి తినడానికి మారం చేస్తున్నారని.. పిల్లలు ఏది అడిగితె అది కొనేస్తున్నారు.. అలా తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే..

Child Care Tips: ఓ వైపు కరోనా.. మరోవైపు సీజనల్ వ్యాధులు.. పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే
Child Care Tips
Follow us

|

Updated on: Jul 30, 2021 | 12:50 PM

Child Care Tips: పిల్లలలు ఏ తల్లిదండ్రులకైనా ముద్దే.. వారి తినడానికి మారం చేస్తున్నారని.. పిల్లలు ఏది అడిగితె అది కొనేస్తున్నారు.. అలా తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే కొన్ని పనులు వారి ఆరోగ్యానికి హానిని కలిగించేవిగా మారుతున్నాయి. అందులో ఒకటి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పిజ్జాలు, బర్గర్లు.. ఇటువంటి జంక్ ఫుడ్ తినడం వలన ముఖ్యంగా వర్షాకాలంలో తినడం వలన పిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఓ వైపు కరోనా మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ.. పిల్లలు తినే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీధుల్లో అమ్మే జంక్ ఫుడ్ తినడం వలన పిల్లలకు బ్యాక్టీరియల్ సమస్యలు వస్తాయి. ఈరోజు వార్షాకాలంలో పిల్లల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

*సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పించేది వ్యక్తిగత పరిశుభ్రత. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం వలన సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. కనుక షేక్ హ్యాండ్ కి దూరంగా ఉండడం మంచిది. అంతేకాదు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. తినే ముందు పిల్లలు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి.

* ఇంట్లో, ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్చి ఉంటే దోమలు వ్యాప్తి చెందుతాయి. మలేరియా, డెంగ్యూ వ్యాధులు రావడానికి దోమలే కారణం. కనుక నీటి నిల్వలను నివారించండి. దోమల నుంచి రక్షణ పొందడానికి దోమతెరలు వాడాలి. * వర్షాకాలంలో తప్పనిసరిగా గొడుగుని వెంట ఉంచుకోవాలి.. బయటకు వెళ్లే సమయంలో రెయిన్‌కోట్‌ తప్పక ధరించాలి. * ప్రతిరోజూ వేడివేడిగా విజిటబుల్‌ సూప్‌ తీసుకోవాలి. అనేక పోషకాలను ఇస్తుంది. * అప్పుడప్పుడు వేడివేడి అల్లం టీ, హెర్బల్‌ టీ తాగితే మంచిది. * శరీరానికి పోషకాలు, విటమిన్లు అందించే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. * వర్షంలో తడిచినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే తలకు స్నానం చేయాలి. అలా చేస్తే జలుబు బారినపడకుండా ఉండొచ్చు. * తాగే నీటిని కాచి వడబోసుకోవాలి. * రోజూ ఎక్కువ నీటిని తాగాలి. దీంతో జలుబు, జ్వరాలనుంచి రక్షణ పొందవచ్చు. ఎక్కువ మోతాదులో నీరు తీసుకుంటే శరీరంలో ఉన్న విషపదార్థాలు, హానికారక సూక్ష్మక్రీము లను నివారించవచ్చు.

ముఖ్యంగా తినే ఆహారపదార్ధాల్లో విటమిన్ సీ ఉండేలా చూసుకోవాలి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ముఖ్యంగా పిల్లలకు రోగనిరోధక శక్తినిచ్చే ఆహారం, ఆకుకూరలు, పండ్లు ఆహారంగా ఇవ్వాలి.

Also Read:   వాము ఆకుతో ఎన్నో ఆరోగ్యప్రయోజలు.. రుచికరమైన వామాకు నువ్వుల రోటి పచ్చడి తయారీ

కాంగ్రెస్ పార్టీకి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు
కాంగ్రెస్ పార్టీకి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..