Anxiety Levels: చిన్న చిన్న విషయాలకే ఆందోళనకు గురవుతున్నారా? మీ శరీరంలో ఈ పోషకాలు తక్కువైతే సమస్య మరింత తీవ్రం
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఆందోళన, మానసిక రుగ్మతల కారణంగా అధిక భయంతో పాటు ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందని తెలుస్తోంది. మానసిక ఒత్తిడి అనేది బయటకు కనిపించినా అది ఆందోళనతో కూడిన ఒత్తిడి అయితే మానసికంగా చాలా ఇబ్బందిపడతాం. ఒత్తిడికి దారి తీసే పరిస్థితులు అనివార్యమైన కొన్ని చర్యలతో ఒత్తిడి లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచవచ్చు. పోషకాహార నిపుణులు ప్రకారం శరీరంలో ముఖ్యంగా ఐదు పోషకాలు ఒత్తిడిని జయించడానికి ఉపయోగపడతాయని తెలుపుతున్నారు.
ప్రస్తుతం అందరినీ మానసిక సమస్యలు వేధిస్తున్నాయి. చాలా మందికి అస్సలు తాము ఆ రుగ్మతతో బాధపడుతున్నామని తెలియకపోవడంతో సమస్యను మరింత తీవ్రం చేసుకుంటున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఆందోళన, మానసిక రుగ్మతల కారణంగా అధిక భయంతో పాటు ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందని తెలుస్తోంది. మానసిక ఒత్తిడి అనేది బయటకు కనిపించినా అది ఆందోళనతో కూడిన ఒత్తిడి అయితే మానసికంగా చాలా ఇబ్బందిపడతాం. ఒత్తిడికి దారి తీసే పరిస్థితులు అనివార్యమైన కొన్ని చర్యలతో ఒత్తిడి లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచవచ్చు. పోషకాహార నిపుణులు ప్రకారం శరీరంలో ముఖ్యంగా ఐదు పోషకాలు ఒత్తిడిని జయించడానికి ఉపయోగపడతాయని తెలుపుతున్నారు. అయితే ఆ పోషకాలు సరైన స్థాయిల్లో ఉంటేనే ఒత్తిడి సమస్య నుంచి గట్టెక్కవచ్చు. నిపుణులు తెలిపే ఆ పోషకాలపై ఓ లుక్కెద్దాం.
విటమిన్ డీ, కే : ఈ విటమిన్లు ముఖ్యంగా మీ శరీరంలో తగిన స్థాయిల్లో ఉండాలి. ఎక్కువ ఎండలో ఉండే వారు, అలాగే జీవనశైలిని సరిగ్గా మెయిన్ టెయిన్ చేయని వారు ఈ విటమిన్ల లోపంతో బాధపడతారు.
జింక్, కాపర్ : శరీరంలో తక్కువ జింక్ శాతం, అలాగే అధిక కాపర్ శాతం ఉంటే మానసిక ఆందోళనకు గురవుతాం. జింక్, కాపర్ స్థాయిలను నిర్ధారించుకోడానికి వైద్య పరీక్షలు తప్పనిసరి
మెగ్నీషియం : శరీరంలో తక్కువ స్థాయి మెగ్నీషియం ఆందోళన, నిరాశకు గురయ్యేులా చేస్తుంది. తగిన వైద్య పరీక్షల అనంతరం మెగ్నీషియం స్థాయి తక్కువుగా ఉంటే సప్లిమెంట్స్ ను వాడడం ఉత్తమం.
ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ : మీరు చేపలు తినని వారైతే కచ్చితంగా ఈ లోపం ఉంటుంది. అందువల్ల కచ్చితంగా ఓమెగా-3 ఆహారంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఓమెగా-3 లోపం ఉంటే తీవ్రమైన మానసిక బాధలకు గురయ్యే అవకాశం ఉంది.
బి-కాంప్లెక్స్ : బి-కాంప్లెక్ లోపం ఉంటే శరీరానికి అవసరమయ్యే సెరొటెనిన్, డొపమైన్, ఇతర న్యూరో ట్రాన్స్ మిటర్లు తయారు చేసే శక్తిని శరీరం కోల్పోతుంది. కాబట్టి బి-కాంప్లెక్స్ శరీరానికి చాలా అవసరం
ఆందోళనకు గురి కాకుండా తీసుకోవాల్సిన ఆహారాలు
పసుపు
పసుపులో కర్కుమిన్ అధికంగా ఉంటుంది. ఈ పోషకం మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే మానసిక ఆందోళన, రుగ్మతలను నివారించేాలా సాయం చేస్తుంది. అధిక యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలతో ఉండే కర్కుమిన్ మెదడు కణాలకు నష్టం కలగకుండా చూస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్న వారు కూడా రోజూ వారీ ఆహారం పసుపును ఉండేలా చూసుకుంటే మరింత మేలు జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
డార్క్ చాక్లెట్
చాలా మంది చాక్లెట్ తినడం మంచి కాదు అని అనుకుంటుంటారు. అయితే డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఆందోళన స్థాయిలు తగ్గుతాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఎల్-థియానైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యం, మానసిక స్థితిపై సానుకూల ప్రభావాలను నమోదు చేస్తుంది.
పెరుగు
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్, అలాగే ఆరోగ్యకరమైన బ్యాక్టిరియా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టిరియా మెరుగైన మెదడు ఆరోగ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి మానసిక సమస్యలతో బాధపడే రోజువారీ ఆహారంలో కచ్చితంగా పెరుగు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి