AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Depression Problems: ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉండటం ఆత్మహత్యకు దారి తీస్తుందా..? సైకాలజిస్ట్‌లు ఏమంటున్నారు..?

Depresion Problems: గత రెండు వారాలుగా తమిళనాడులో ఆత్మహత్యల కేసులు పెరుగుతున్నాయి. తాజాగా శివగంగై జిల్లా కరైకుడిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సెల్వకుమార్..

Depression Problems: ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉండటం ఆత్మహత్యకు దారి తీస్తుందా..? సైకాలజిస్ట్‌లు ఏమంటున్నారు..?
Depression Problems
Subhash Goud
|

Updated on: Aug 04, 2022 | 3:28 AM

Share

DepressionProblems: గత రెండు వారాలుగా తమిళనాడులో ఆత్మహత్యల కేసులు పెరుగుతున్నాయి. తాజాగా శివగంగై జిల్లా కరైకుడిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సెల్వకుమార్ (17) సాకోట్టైలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. అయితే బుధవారం తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత రెండు వారాల్లో తమిళనాడులో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం ఇది ఐదో ఘటన కావడం స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీకి చెందిన సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్ చుగ్ TV9తో మాట్లాడుతూ.. ఆత్మహత్య ద్వారా మరణం వెనుక ఉన్న మనస్తత్వశాస్త్రం, ఒక వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నాడో వంటి విషయాలను తెలియజేశారు.

ఆలోచన వెనుక జన్యుపరమైన కారణం:

ఈ రకమైన ఆలోచనకు దారితీసే జన్యుపరమైన కారణం ఉందని డాక్టర్‌ సంజయ్‌ చుగ్‌ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన ఉండి.. ఒక విద్యార్థి పరీక్షలో రాణించలేనప్పుడు, అది అతని మనస్సులో తీవ్రమైన దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది నెమ్మదిగా మరింతగా పెరుగుతుంది. ఇది మూడు విషయాల కలయికకు దారి తీస్తుంది. దీనిని ఇంగ్లిష్‌లో ట్రయాడ్ ఆఫ్ సూసైడ్ అంటారు.

ఇవి కూడా చదవండి

ఈ సమయంలో ఉద్రిక్త నిస్సహాయ భావన ఉంది. తన భవిష్యత్తు అంధకారమైందని, దానిని ఓర్చుకునే శక్తి లేదని భావిస్తాడు. ఈ సందర్భంలో పిల్లవాడు తన చుట్టూ ఉన్న వ్యక్తులతో తనను తాను పోల్చుకుంటాడు. ఇది అతనిలో న్యూనతను సృష్టిస్తుంది. తన వల్ల ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంటాడు. అటువంటి పరిస్థితిలో, వారు కూడా ఆత్మహత్య చేసుకోవడం వంటికి పూనుకొంటారని చెబుతున్నారు.

నిద్రలో మెదడు, శరీరంలోని అన్ని టాక్సిన్స్ బయటకు వస్తాయి. పిల్లలకి తగినంత నిద్ర లేకపోతే టాక్సిన్స్ బయటకు వెళ్ళలేవు. ఇది న్యూరోటాక్సిసిటీకి దారితీస్తుంది. ఇది ఒక వ్యక్తిని అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు గురి చేస్తుందని డాక్టర్‌ చుగ్‌ పేర్కొంటున్నారు. ఇలా రకరకాల కారణాల వల్ల విద్యార్థులు, యువకులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వైద్యుడు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి