Depression: డిప్రెషన్‌తో బాధపడుతున్నారా..? మర్చిపోయి కూడా వీటిని తీసుకోకండి.. అలా చేస్తే

కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కొంతకాలంపాటు ఆనందాన్ని పొందవచ్చు.. కానీ దీర్ఘకాలంలో అవి మిమ్మల్ని మరింత డిప్రెషన్‌లో పడేసే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

Depression: డిప్రెషన్‌తో బాధపడుతున్నారా..? మర్చిపోయి కూడా వీటిని తీసుకోకండి.. అలా చేస్తే
Depression
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 03, 2022 | 6:10 AM

Foods To Avoid In Depression: మనం తీసుకునే ఆహారం, పానీయాలు మన ఆరోగ్యం, మెదడుపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని ఆహారాలను దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా మానసిక స్థితిని మార్చడానికి తరచుగా అనేక రకాల ఆహారాలను తీసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితిలో డిప్రెషన్ లేదా ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, కొన్ని ఆహారాలను తినకుండా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కొంతకాలంపాటు ఆనందాన్ని పొందవచ్చు.. కానీ దీర్ఘకాలంలో అవి మిమ్మల్ని మరింత డిప్రెషన్‌లో పడేసే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. వీటి కారణంగా నిరాశ లేదా ఒత్తిడి, ఆందోళన పెరిగే అవకాశం ఉందంటున్నారు. అటువంటి పరిస్థితిలో, ఎటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలనే విషయాలను తెలసుకోవడం ముఖ్యం. అవేంటో తెలుసుకోండి..

వీటికి దూరంగం ఉండండి..

సోడియం అధికంగా ఉండే ఆహారాలు: ప్యాక్ చేసిన పేస్ట్రీలు, బిస్కెట్లు, బ్రెడ్‌లలో చాలా సోడియం ఉంటుంది. ఇవి డిప్రెషన్ ను పెంచుతుంది. ఈ ఆహారాలు తినడం వల్ల మీ కడుపులో అజీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల సోడియం అధికంగా ఉండే వాటిని తినకూడదు.

ఇవి కూడా చదవండి

కెఫిన్ కలిగిన పదార్థాలు: చాలా మంది నిద్ర నియంత్రించడానికి టీ లేదా కాఫీని తీసుకుంటారు. ఈ రెండింటిలో కెఫిన్ అధికంగా ఉంటుంది. టీ, కాఫీ నిద్రను తగ్గించడానికి పనిచేస్తాయని, దీని కారణంగా ఆందోళన మరింత పెరుగుతుంది. ఎందుకంటే కెఫిన్ ఉన్న వాటిని తీసుకోవడం ద్వారా చికాకు కలుగుతుంది. క్రమంగా డిప్రెషన్ కూడా పెరుగుతుంది. అందువల్ల డిప్రెషన్ సమస్యతో బాధపడుతుంటే కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి.

మద్యం-ధూమపానం: ఆల్కహాల్, ధూమపానం శరీరానికి హాని కలిగిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నట్లయితే మద్యం, సిగరెట్‌కు దూరంగా ఉండాలి. వీటిని తీసుకుంటే.. నిద్ర సరిగ్గా పట్టదు. ఫలితంగా ఆందోళన, డిప్రెషన్ పెరుగుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి