Lung Cancer: వామ్మో.. సిగరెట్ తాగకపోయినా లంగ్స్ క్యాన్సర్ వస్తుందట..! తాజా పరిశోధనలో సంచలన విషయాలు..

పొగ తాగని వారికి కూడా క్యాన్సర్ ఎందుకు వస్తుంది. దీనికి ప్రధాన కారణంగా సిగరెట్ తాగే వారు వదిలిన పొగను పక్కన ఉన్నవారు పీల్చడం. క్యాన్సర్ సోకిన నాన్ స్మోకర్స్ లో దాదాపు వీరే అధికంగా ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Lung Cancer: వామ్మో.. సిగరెట్ తాగకపోయినా లంగ్స్ క్యాన్సర్ వస్తుందట..! తాజా పరిశోధనలో సంచలన విషయాలు..
Lung Cancer
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 11, 2023 | 7:37 PM

ఊపిరితిత్తుల క్యాన్సర్.. సాధారణంగా రోజూ ధూమపానం చేసే వారికి వస్తుందని అందరికీ తెలుసు. కానీ సిగరెట్ తాగని వారికి కూడా వచ్చే అవకాశం ఉందా? అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. అందుకు గల కారణాలను కూడా వివరిస్తున్నారు. ఆ విశేషాల గురించి తెలుసుకుందాం..

పొగ తాగని వారికి ఎందుకు వస్తుంది..

పొగ తాగని వారికి కూడా క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీనికి ప్రధాన కారణంగా సిగరెట్ తాగే వారు వదిలిన పొగను పక్కన ఉన్నవారు పీల్చడం. క్యాన్సర్ సోకిన నాన్ స్మోకర్స్ లో దాదాపు వీరే అధికంగా ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే ధూమపానం అలవాటు లేని వారికి క్యాన్సర్ రావడానికి మరో ప్రధాన కారణం గాలి కాలుష్యం. దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యం అంతకంతకూ పెరుగుతూ ఉండటం కూడా లంగ్ క్యాన్సర్ బాధితులు పెరగడానికి కారణమవుతుంది. కలుషిత గాలిలో ఉండే ఆస్బెస్టస్, రాడాన్ వంటివి క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

పరిశోధనలు ఇలా..

ఇటీవల శాస్త్రవేత్తలు ధూమపానం చేసే వారికి, అలాగే ఆ అలవాటు లేని వారికి.. టీనేజ్ మొదలుకొని 80 ఏళ్ల వరకూ వారి ఊపిరిత్తులను పరీక్షించారు. ఈ పరీక్షలో పొగతాగే వారిలో జన్యుపరమైన మ్యూటేషన్లు అధికంగా నమోదైనట్లు గుర్తించారు. దీని కారణంగా వారు త్వరగా క్యాన్సర్ బారిన పడుతున్నట్లు నిర్ధారించారు. ఇది మాత్రమే కాక టుబాకో కారణంగా దీర్ఘకాలంలో గొంతు క్యాన్సర్, లివర్, జీఐ ట్రాక్ట్, బ్లాడర్ క్యాన్సర్స్, అలాగే సీఓపీడీ( క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఇవి గుర్తుంచుకోవాలి..

పొగ తాగే వారు వారితో పాటు తోటి వారి ప్రాణాలను కూడా రిస్క్ పెడుతున్నారన్న విషయాన్ని గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. అవకాశం ఉన్నంత వరకూ ధూమపానానికి దూరం కావాలని సూచిస్తున్నారు. దీని కోసం అంకాలజీ సంబంధిత ఆస్పత్రులు కొన్ని సెంటర్లను కూడా ఏర్పాటు చేసి పొగ అలవాటును మాన్పించే విధంగా కౌన్సెలింగ్ తో పాటు చికిత్స అందిస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని మీరు పొందుకోవడంతో పాటు పక్కన ఉన్న వారికి కూడా అందివ్వాలని హితవు పలుకుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..