‘ఆ సమస్యకు ఆన్‌లైన్ క్లాస్’ ఇవ్వనున్న బాలీవుడ్ భామ

Deepika Padukone Online Tutoring : ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల వ‌ర‌కూ చాలామంది డిప్రెష‌న్‌లో కూరుకుపోయిన‌ట్లు ఎప్ప‌టిక‌ప్పుడే వార్త‌లు వ‌స్తున్నాయి. కరోనాతో ఇంటికే పరిమితమైన చాలా మంది మానసిక రుగ్మతలతో కుంగిపోతున్నారు. ఢిల్లీ, ముంబై, పూణే వంటి మహానగరాల్లో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇలా డిప్రేషన్ కు గురవుతున్నవారిని అక్కున చేర్చుకునేందుకు బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ముందుకు వచ్చారు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇలాంటివారి సమస్యలను పరిష్కారం చూపించేందుకు […]

'ఆ సమస్యకు ఆన్‌లైన్ క్లాస్' ఇవ్వనున్న బాలీవుడ్ భామ
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 07, 2020 | 11:26 AM

Deepika Padukone Online Tutoring : ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల వ‌ర‌కూ చాలామంది డిప్రెష‌న్‌లో కూరుకుపోయిన‌ట్లు ఎప్ప‌టిక‌ప్పుడే వార్త‌లు వ‌స్తున్నాయి. కరోనాతో ఇంటికే పరిమితమైన చాలా మంది మానసిక రుగ్మతలతో కుంగిపోతున్నారు. ఢిల్లీ, ముంబై, పూణే వంటి మహానగరాల్లో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇలా డిప్రేషన్ కు గురవుతున్నవారిని అక్కున చేర్చుకునేందుకు బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ముందుకు వచ్చారు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇలాంటివారి సమస్యలను పరిష్కారం చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

కరోనా కారణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సామాజిక ఒంటరితనం, భవిష్యత్తుపై అనిశ్చితి ఇందుకు కారణంగా మారుతున్నాయని అన్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో ఒత్తిడి, ఆందోళన, నిరాశతో ఉన్నటివంటివారి కోసం ఆన్ లైన్ ద్వారా చికిత్స అందించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ‘లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ ద్వారా పరిష్కారం చూపిస్తామని అన్నారు.  జూలై 12 నుంచి ఆన్ లైన్ ట్యూటరింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా లైవ్ మాస్టర్ టాక్ సెషన్ ఉంటుందని.. అందులో  పాల్గొనాలని దీపిక కోరారు.