విదేశీ విద్యార్థులకు అమెరికా షాక్ !
తమ దేశంలో ఆన్ లైన్ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులకు అమెరికా షాకిచ్చింది. కరోనా వైరస్ కారణంగా వారిని ఇక తమ దేశంలో ఉండడానికి అనుమతించబోమని హెచ్చరించింది. నాన్-ఇమ్మిగ్రంట్ ఎఫ్-1, ఎం-1 విద్యార్థులు ఇక తమ స్వస్థలాలకు..
తమ దేశంలో ఆన్ లైన్ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులకు అమెరికా షాకిచ్చింది. కరోనా వైరస్ కారణంగా వారిని ఇక తమ దేశంలో ఉండడానికి అనుమతించబోమని హెచ్చరించింది. నాన్-ఇమ్మిగ్రంట్ ఎఫ్-1, ఎం-1 విద్యార్థులు ఇక తమ స్వస్థలాలకు బయలుదేరవచ్చునని ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ దేశంలో సుమారు పది లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా పలు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతబడడంతో ఇక వారికి ఆన్ లైన్ క్లాసులే దిక్కయ్యాయి. తమ వార్నింగ్ ని పట్టించుకోకుండా విద్యార్థులెవరైనా ఇంకా ఈ తరగతులకు హాజరవుతుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ విభాగం పేర్కొంది. వారికి వీసాలను ఉపసంహరిస్తామని తెలిపింది. కాగా ఎఫ్-1 విద్యార్థులు అకడమిక్ కోర్స్ వర్క్ ను, ఎం-1 స్టూడెంట్స్ ఒకేషనల్ కోర్స్ వర్క్ ను కొనసాగిస్తున్నారు. ఇక భవిష్యత్ సెమిస్టర్ గురించి పలు కాలేజీలు, యూనివర్సిటీలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అమెరికాలో ఆ మధ్య కరోనా వైరస్ కొంతవరకు తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభించింది. లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోవద్దని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించడంతో ఇక ప్రజలు స్వేఛ్చగా బీచ్ ల పై పడ్డారు. నైట్ క్లబ్బులు, బార్లు తిరిగి యువతతో నిండిపోతున్నాయి.