అతిచౌక వెంటిలేటర్ ‘కోరోవెంట్’..!
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో చెక్ రిపబ్లిక్‌లో వెంటిలేటర్లు లేక రోజుకు 250 మంది కరోనా రోగుల గుండెలు ఆగిపోతుండటాన్ని.. మార్కెట్లో వెంటిలేటర్ల
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో చెక్ రిపబ్లిక్‌లో వెంటిలేటర్లు లేక రోజుకు 250 మంది కరోనా రోగుల గుండెలు ఆగిపోతుండటాన్ని.. మార్కెట్లో వెంటిలేటర్ల ధరలు మండిపోతుండటాన్ని ఆపేందుకు.. ఐటీ కంపెనీలు, వివిధ రంగాల నిపుణులు ఏర్పాటుచేసిన 30 మంది వలంటీర్ల బృందం స్వచ్ఛందంగా చేసిన కృషి ఫలించింది. ఐదు రోజుల వ్యవధిలోనే అతిచౌక వెంటిలేటర్ ‘కోరోవెంట్’ ఆవిష్కృతమైంది.
మరోవైపు.. వైద్య పరిజ్ఞానం, ఇంజనీరింగ్‌పై అవగాహన లేకున్నా.. కలిసికట్టుగా శ్రమించారు. ‘దేశం కోసం సహాయం చేయండి’ అనే పిలుపునకు విరాళాలు వెల్లువెత్తాయి. చెక్ టెక్నికల్ వర్సిటీ బయో మెడికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కారెల్ రూబిక్ నుంచి సాంకేతిక అంశాలపై సలహాలను తీసుకున్నారు. వెంటిలేటర్ డిజైనింగ్ పూర్తయ్యాక.. వలంటీర్‌గా చేరిన పీజీ విద్యార్థి ఒకరు వర్సిటీ ల్యాబ్‌లో వెంటిలేటర్‌ను పరీక్షించాడు. బాగానే పనిచేయడంతో.. తయారీపై దృష్టిసారించి నమూనా (ప్రొటోటైప్)ను విడుదల చేశారు.
Also Read: కర్ణాటకలో అడవుల్లో ‘బగీరా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..