Heart Attack: పెరుగుతున్న గుండెపోటు మరణాలు.. గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఈ రోజుల్లో ఆనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు దరి చేరుతున్నాయి. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం, టెన్షన్‌, ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గుండెపోటుకు సంబంధించి ప్రభుత్వం..

Heart Attack: పెరుగుతున్న గుండెపోటు మరణాలు.. గణాంకాలు ఏం చెబుతున్నాయి?
Heart Attack
Follow us
Subhash Goud

|

Updated on: Dec 08, 2023 | 7:51 PM

ఈ రోజుల్లో ఆనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు దరి చేరుతున్నాయి. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం, టెన్షన్‌, ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గుండెపోటుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు అప్రమత్తం చేస్తున్నాయి. నేడు చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటు ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారత్‌లో గత మూడేళ్లలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కోవిడ్ 19 తర్వాత గుండె జబ్బుల ప్రమాదం చాలా రెట్లు పెరిగింది. ఎన్‌సిఆర్‌బి విడుదల చేసిన కొత్త డేటా ప్రకారం.. గత ఏడాది 2022లోనే గుండెపోటు కేసులు 12.5% ​​పెరిగాయి. గుండెపోటు రాకుండా ఉండాలంటే ప్రభుత్వ గణాంకాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..

గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో 32,457 మంది గుండెపోటుతో మరణించగా, 2021లో 28,413 మంది గుండెపోటుతో మరణించారు. ఇండియా టుడేలోని ఒక నివేదిక ప్రకారం, 2022లోనే గుండెపోటు ఆకస్మిక మరణానికి తీవ్రమైన కారణం. 2020లో 28,579 మంది మరణించగా, 2021లో ఈ సంఖ్య తగ్గి 28,413కి చేరగా, 2022లో మళ్లీ పెరిగి ఆ సంఖ్య 32,457కి పెరిగింది. గుండెపోటును నివారించే మార్గాలు

ఇవి కూడా చదవండి

1. జీవనశైలిలో మార్పులు చేసుకోండి.

2. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే స్వీకరించండి. అదనపు కొవ్వు, నూనె, మాంసం మానుకోండి. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, గింజలు, చేపలను చేర్చండి.

3. సిగరెట్, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం మానుకోండి.

4. బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉండేలా ప్రయత్నించండి.

5. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. శరీర బరువు పెరగనివ్వవద్దు.

6. ధ్యానం, శ్వాస పద్ధతులు, యోగా సాధన చేయండి.

7. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు డాక్టర్ చేత చెక్ చేసుకోండి.

గుండె ఆరోగ్యం కోసం ఏమి నివారించాలి

1. గుండెకు హాని కలిగించే ఆహారాన్ని తీసుకోవద్దు.

2. ఉప్పు ఎక్కువగా ఉన్న వాటిని తినవద్దు.

3. శుద్ధి చేసిన చక్కెర, పిండి పదార్ధాలను నివారించండి.

4. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండి.

5. సంతృప్త కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవద్దు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..
33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ వచ్చేసిందోచ్..
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ వచ్చేసిందోచ్..
ట్రైన్‌‌ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన..
ట్రైన్‌‌ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన..
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తోంది.. గ్లామర్ సెన్సేషన్..
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తోంది.. గ్లామర్ సెన్సేషన్..
ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
అలా ఉన్నా డయాబెటిస్ బారిన పడతారంట.. షాకింగ్ విషయాలు..
అలా ఉన్నా డయాబెటిస్ బారిన పడతారంట.. షాకింగ్ విషయాలు..
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం..!
ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం..!