Winter Care: బీ అలర్ట్.. ఈ అనారోగ్య సమస్య చలికాలంలో ప్రాణాంతకంగా మారవచ్చు.. వెంటనే ఇలా చేయండి..
శీతాకాలం కొంతమందికి చాలా ఇబ్బందికరమైనది, ప్రమాదకరమైనది. వారి జీవితాలు కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంది. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్న బాధితులు..

శీతాకాలం కొంతమందికి చాలా ఇబ్బందికరమైనది, ప్రమాదకరమైనది. వారి జీవితాలు కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంది. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్న బాధితులు.. నిత్యం తమను తాము ప్రత్యేకంగా, జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆస్తమా రోగులు చలికాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. శ్వాస తీసుకోవడంలో అవస్థలు పడుతుంటారు. చలికాలంలో ఈ సమస్య కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. మరి శీతాకాలంలో ఆస్తమా పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాణంతకం కాకుండా ఏం చేయాలి? ఆస్తమా పేషెంట్లను ఇబ్బంది పెట్టే సమస్యలేంటి? వాటి నివారణకు ఎలాంటి చర్యలు చేప్టటాలి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆస్తమాకు కారణం..
ఈ తీవ్రమైన వ్యాధిలో శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆస్తమా వ్యాధిలో శ్వాసకోశ గొట్టాలలో వాపు ఉంటుంది. దీని కారణంగా శ్వాస మార్గం చిన్నదిగా, ఇరుకైనదిగా మారుతుంది. శ్వాసకోశ నాళాలు ఇరుకైనప్పుడు శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఇది కాకుండా దగ్గు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఛాతీలో నొప్పి, గురక, ఛాతీలో బిగుతు ఉండటం వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. నివేదికల ప్రకారం.. ప్రపంచంలో దాదాపు 235 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. ఇందులో సుమారు 40 మిలియన్ల మంది యువతులు ఆస్తమా బారిన పడ్డారు.
ఉబ్బసానికి ప్రధాన కారణం..
కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆస్తమా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కలుషితమైన గాలి ఊపిరితిత్తులకు సోకుతుంది. ఇది ఎప్పటికీ తక్కువ అవదు. ఆస్తమా రోగులు పొరపాటున కూడా కాలుష్యం ఉన్న ప్రాంతానికి వెళ్లకూడదు. కాలుష్యం ఎక్కువగా ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అది ప్రాణ సంకటంగా మారే ప్రమాదం ఉంది.




ఇలా జాగ్రత్త పడండి..
ఉబ్బసానికి మూల కారణాలు ఇప్పటికీ పూర్తిగా తెలియలేదు. ఈ వ్యాధి వృద్ధులు, పిల్లలో సాధారణం. ఆస్తమా బాధితులు.. దుమ్ము, బురద, కాలుష్య ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ధూమపానం చేయొద్దు. అంతేకాదు.. చల్లని ప్రదేశాలు, చల్లని నీరు తాగడం మానుకోవాలి. ఆస్తమాతో బాధపడేవారు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. దుమ్ము, ధూళి శ్వాస తీసుకోవడం ఇబ్బంది పెడుతాయి. ఇది ఆస్తమా అటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది కాకుండా, శ్వాస వ్యాయామాన్ని కూడా చేయాలి. ద్యానం, ప్రాణయామం వంటివి చేయాలి.
లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..