Garlic Water: ఆ సమస్యలకు దివ్యఔషధం వెల్లుల్లి నీరు.. రోజూ పరగడుపున తాగితే డబుల్ బెనిఫిట్స్..
వెల్లుల్లి అనేక రకాల ఔషధాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మసాలా దినుసుతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Garlic Water Health Benefits: వెల్లుల్లి అనేక రకాల ఔషధాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మసాలా దినుసుతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వెల్లుల్లిలోని ఉపయోగకరమైన ఔషధ గుణాలు ఇది అనేక వ్యాధుల నుంచి రక్షించి.. ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే, వెల్లుల్లి నీటిని రెగ్యులర్‌గా తాగితే.. ఆరోగ్యంగా ఉండొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మనం ప్రతిరోజూ ఒక గ్లాసు వెల్లుల్లి నీటిని తాగడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయని.. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు.
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులను దూరం చేస్తాయి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ బి1, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇంకా ఆరోగ్యానికి మేలు చేసే మాంగనీస్, కాల్షియం, ఐరన్ కూడా ఉన్నాయి. వెల్లుల్లి నీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వెల్లుల్లి నీటి వల్ల కలిగే ప్రయోజనాలు..
ఉదర వ్యాధులకు చెక్: వెల్లుల్లి పొట్టకు చాలా మేలు చేస్తుంది. గార్లిక్ వాటర్ తాగడం వల్ల అనేక ఉదర సమస్యలను నయం చేస్తుంది. వెల్లుల్లి కడుపు నొప్పి, గ్యాస్, తిమ్మిరి, ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైనా జీర్ణక్రియకు ఆటంకం కలిగితే.. అలాంటి వారు ప్రతిరోజూ ఉదయం వెల్లుల్లి నీటిని తీసుకోవాలి. వెల్లుల్లి నీళ్లు తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
గుండెకు ప్రయోజనకరం: వెల్లుల్లిలో ఉండే మూలకాలు రక్తాన్ని పలుచగా చేస్తాయి. దీని వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అనేక గుండె జబ్బులకు కారణం రక్తం గడ్డకట్టడం. గార్లిక్ వాటర్ తాగడం వల్ల రక్తం పల్చగా మారి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో గుండెకు మేలు చేసే అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అయితే, గుండె జబ్బుల విషయంలో వైద్యుల సలహా తప్పనిసరి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: వెల్లుల్లి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు సమస్య దూరమవుతుంది.
వెల్లుల్లి నీరు.. ఎప్పుడు, ఎలా తాగాలి
రెండు గ్లాసుల నీటిలో రెండు-మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మరిగించాలి. ఇలా చేస్తే వెల్లుల్లిలోని పోషకాలన్నీ నీటిలో కలిసిపోతాయి. రుచి కోసం మిరియాలు, నల్ల ఉప్పు వేసి ఈ నీటిని తాగవచ్చు. అనేక పోషక విలువలున్న ఈ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల మరింత మేలు జరుగుతుంది. ఇంకా అల్పాహారం తర్వాత లేదా భోజనం తర్వాత తాగవచ్చు. రుచి కోసం తేనె, నిమ్మ రసాన్ని కలిపి ఈ నీటిని తీసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి