Alcohol Breath Tips: మద్యం సేవించిన తర్వాత నోటి దుర్వాసనను ఎలా వదిలించుకోవాలి?.. ఈ టిప్స్‌తో ఆ స్మెల్ చిటికెలో మాయం
How To Remove Smell Of Alcohol: స్నేహితులు కలిసినప్పుడో.. ఏదైనా స్పెషల్ అకేషన్‌లోనే జస్ట్ కొద్దిగా మద్యం సేవించేవారికి.. ఆ తర్వాత వచ్చే నోటి దుర్వాసనతో చాలా ఇబ్బంది పడుతుంటారు..
మద్యం సేవించే వ్యక్తులు రెండు రకాలు. అప్పుడప్పుడు తాగేవారు.. మరికొందరు మద్యంకు బానిసలుగా మారేవారు. అప్పుడప్పుడు తాగేవారు ఎవరంటే.. స్నేహితులు కలిసినప్పుడో.. ఏదైనా స్పెషల్ అకేషన్‌లోనే జస్ట్ కొద్దిగా మద్యం సేవించేవారు. మరోరకం ఎవరంటే మొదటి వారికి పూర్తి రివర్స్.. అంటే వీరు మద్యానికి బానిసలు.. నిత్యం తాగుతూనే ఉంటారు. అతిగా తాగడం మంచి అలవాటు కాదు. అయితే.. అప్పుడప్పుడు తాగేవారు.. తాగిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు.. ఇక రెండవ రకం వ్యక్తులకు ఇది సాధారణ సమస్య. ఇలాంటివారికి మద్యం మత్తు పోతుందని ఆందోళన తప్పా వాసన గురించి పెద్దగా పట్టించుకోరు. అదే.. అప్పుడప్పుడు మద్యం సేవించేవారు నోటి నుంచి వాసనతో ఇబ్బంది పడుతుంటారు.
మద్యం సేవించిన తర్వాత దాని వాసన నోటి నుంచి త్వరగా పోదు. దీనివల్ల ఒక్కోసారి ప్రజలు సిగ్గుపడాల్సి వస్తుంది. మనం ఈ రోజు తెలుసుకునే చిన్ని చిట్కాతో మద్యం సేవించిన విషయం ఎవరికి తెలియకుండా.. తర్వాత నోటి నుంచి వచ్చే మద్యం వాసనను వదిలించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం..
ఇలా చేస్తే ఆల్కహాల్ వాసన అస్సలు రాదు..
ఒక కప్పు స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ తాగడం వల్ల నోటి నుంచి వచ్చే ఆల్కహాల్ వాసనను దూరం చేసుకోవచ్చు. కాఫీ వాసన చాలా బలంగా ఉన్నందున.. మద్యం వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ చిట్కాతో కూడా వాసనను..
వెల్లుల్లి, ఉల్లిపాయతో..
వెల్లుల్లి, ఉల్లిపాయలతో నోటి వాసనను తొలగించుకోవచ్చు. దీని కోసం మీరు సలాడ్‌తో కలిపి ఉల్లిపాయలను తినవచ్చు. అంతే కాకుండా వెల్లుల్లిని నమలడం వల్ల ఆల్కహాల్ వాసన వెంటనే పోతుంది. అవును, బయటికి వెళ్లే ముందు వెల్లుల్లి, ఉల్లిపాయలను ఉపయోగించకుండా.. మౌత్ వాష్‌పై పుల్లింగ్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ రెండింటి వాసన కూడా ఇతరులను ఇబ్బంది పెడుతుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం