AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer in Kids: పిల్లలకు వచ్చే క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలో తెలుసా? సకాలంలో స్పందించకుంటే లేత కుసుమాలు నేల రాలిపోతాయి..

ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు బానిసైన వారికి.. అందునా వయసుపై బడిన వారికి మాత్రమే వస్తుందని అధిక శాతం మంది భావిస్తారు. నిజానికి చిన్న పిల్లల్లో కూడా ఈ వ్యాధి ప్రబలంగా ఉందని మీకు తెలుసా?..

Cancer in Kids: పిల్లలకు వచ్చే క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలో తెలుసా? సకాలంలో స్పందించకుంటే లేత కుసుమాలు నేల రాలిపోతాయి..
Cancer In Kids
Srilakshmi C
|

Updated on: Sep 21, 2022 | 12:32 PM

Share

Modren Cancer treatment methods to Kids: ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు బానిసైన వారికి.. అందునా వయసుపై బడిన వారికి మాత్రమే వస్తుందని అధిక శాతం మంది భావిస్తారు. నిజానికి చిన్న పిల్లల్లో కూడా ఈ వ్యాధి ప్రబలంగా ఉందని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా పిల్లలు ప్రతీయేట క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు గల ప్రధాన కారణం.. పిల్లల్లో వ్యాధిని గుర్తించలేకపోవడం. సకాలంలో క్యాన్సర్‌కు చికిత్స అందించకపోతే పరిస్థితి చేజారిపోతుంది. పసిపిల్లల్లో ముఖ్యంగా.. లుకేమియా, బ్రెయిన్ ట్యూమర్‌, స్కిన్‌ క్యాన్సర్, న్యూరోబ్లాస్టోమా, లింఫోమా వంటి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు తెల్పుతున్నాయి. పిల్లలకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వడమనేది వైద్యులకు సవాలుతో కూడుకున్న విషయం. మెడికల్‌ సైన్స్‌లో అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆధారంగా రూపొందించిన మోడ్రన్‌ ట్రీట్‌మెంట్‌ అందుబాటులో ఉండే స్పెషలైజ్‌డ్‌ క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులకు చికిత్స అందించడం సులభతరం అవుతుంది. లేటెస్ట్ డయాగ్నోస్టిక్స్, ఎక్విప్‌మెంట్‌కు యాక్సెస్ఫెసిలిటీస్‌ ఉన్న ఇటువంటి ఆసుపత్రుల్లోని వైద్య నిపుణులు ఎంతో అనుభవంతో ఈ వ్యాధి నివారణకు చికిత్సనందిస్తారని ఆన్‌క్వెస్ట్ లాబొరేటరీస్ లిమిటెడ్‌లో పాథాలజిస్ట్, చీఫ్ కన్సల్టెంట్‌గా ఉన్న డాక్టర్ శివాలి అహ్లావత్ అంటున్నారు. పిల్లలకు వచ్చే క్యాన్సర్లనే ఎలా గుర్తించాలి? ఏ విధమైన క్యాన్సర్ ముప్పును అధిగమించాలనే విషయాలు డాక్టర్ శివాలి అహ్లావత్ మాటల్లో మీకోసం..

క్యాన్సర్ వ్యాధి నిర్ధారణపైనే పూర్తి చికిత్స ఆధారపడి ఉంటుంది

పిల్లలకు వచ్చే క్యాన్సర్‌ వ్యాధిని సకాలంలో గుర్తిస్తేనే, దాని నివారణకు ప్రభావవంతమైన చికిత్స అందించగలం. క్యాన్సర్‌ నిర్ధారణకు కొన్ని ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిని గుర్తించాలి. బయాప్సీ, బ్లడ్‌ టెస్ట్‌, లంబర్‌ పంక్చర్, MRI, PET-CT స్కాన్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షల ద్వారా పిల్లల్లో క్యాన్సర్‌ నిర్ధారణ చేయవచ్చు. ఈ టెస్టుల్లో క్యాన్సర్ ఉందని నిర్ధారించబడిన తర్వాత, అది ఏ విధమైన క్యాన్సర్, ఏ దశలో ఉందనే విషయాలను బట్టి, అందుకు తగిన ట్రీట్‌మెంట్‌ను డాక్టర్లు సిఫార్సు చేస్తారు.

ఇవి కూడా చదవండి
  • కీమోథెరపీ

సాధారణంగా క్యాన్సర్ కణాల పెరుగుదల, విభజన, ఉత్పత్తిని నిరోధించడానికి డాక్టర్లు కీమోథెరపీ ఇస్తారు. క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి మెడికేషన్స్‌ వాడుతారు. నిర్ణీత కాల వ్యవధిలో ఈ ట్రీట్‌మెంట్‌ ఇస్తారు. ఐతే కీమోథెరపీ వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. అలసట, వికారం, వాంతులు, జుట్టు రాలడం, ఆకలి మందగించడం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఐతే కీమోలో ఇచ్చే మెడిసిన్‌ మోతాదును బట్టి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ప్రభావం ఆధారపడి ఉంటాయి. కీమో కోర్సు పూర్తైన తర్వాత ఈ లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

  • ఇంజెక్టబుల్ మెడికేషన్‌

క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్లలో ఇది కూడా ఒకటి. ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే మెడిసిన్‌ పిల్లలో ఇమ్యూన్‌ సిస్టంను బలపరుస్తుంది. ఈ ఇంజెక్షన్ మెడిసిన్‌ క్యాన్సర్‌ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. బ్లెడ్‌ స్ట్రీమ్‌లో ఇంజెక్షన్‌ ఇవ్వడం మూలంగా శరీరం అంతటా విస్తరించి ఉన్న క్యాన్సర్‌ కణాలను చంపేస్తుంది. ఈ విధమైన డ్రగ్‌ను సిస్టమేటిక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు డాక్టర్లు ఉపయోగిస్తారు. సాధారణంగా క్యాన్సర్‌తో బాధపడే చిన్నారులకు పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్‌లు ఈ రకమైన చికిత్సను రికమెండ్‌ చేస్తారు.

  • స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌

లుకేమియా, లింఫోమా క్యాన్సర్లకు చికిత్సగా స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను వినియోగిస్తారు. ఈ విధమైన క్యాన్సర్‌ వ్యాధిలో ఎముక మజ్జను (bone marrow) తొలగించి హై లెవల్‌ స్పెషలైజేషన్‌ను దాని స్థానంలో నింపుతారు. నిజానికి.. ఎముక మజ్జను ఆరోగ్యవంతంగా ఉంచడంలో హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్ కీలక పాత్ర వహిస్తాయి. ఎముక మజ్జలో రక్తాన్ని తయారు చేసే కణాలలో, అలాగే రక్త ప్రసరణలో కూడా హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ లేదా హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ లుకేమియా, లింఫోమా క్యాన్సర్‌ నివారణలో కీలకమైనది.

  • రేడియేషన్‌ థెరపీ

లుకేమియా క్యాన్సర్‌ మెదడుకు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి రేడియేషన్‌ థెరపీని వినియోగిస్తారు. అబ్బాయిల్లో వృషణాలకు (testicles) చికిత్స చేయడానికి కూడా ఈ విధమైన ట్రీట్‌మెంట్ ఉపయోగిస్తారు. రేడియేషన్‌ థెరపీలో క్యాన్సర్ కణాలను చంపడానికి హై ఎనర్జీ రేడియేషన్‌ను ఉపయోగిస్తారు. ఐతే డాక్టర్లు ఎక్కువగా రేడియేషన్‌ థెరపీని పిల్లలకు వినియోగించరు. ఎందువల్లనంటే పిల్లలకు ఆరోగ్యకరమైన అవయవాలు, కణజాలాలు ఏర్పడడంలో రేడియేషన్‌ థెరపీ తీవ్ర హాని తలపెడుతుందని డాక్టర్ అహ్లావత్ సూచించారు.