AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rare Case: తీవ్రమైన కంటినొప్పితో ఆస్పత్రిలో చేరిన మహిళ.. పరీక్షలు చేసి ఖంగుతిన్న డాక్టర్లు.. చివరికి..!

Bengaluru SS SPARSH Hospital: బెంగళూరులో ఓ 65 ఏళ్ల మహిళకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. సంవత్సరం క్రితం మ్యూకోర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్), కోవిడ్19 నుంచి కోలుకున్న రోగి కళ్లు, ముక్కు..

Rare Case: తీవ్రమైన కంటినొప్పితో ఆస్పత్రిలో చేరిన మహిళ.. పరీక్షలు చేసి ఖంగుతిన్న డాక్టర్లు.. చివరికి..!
Maggots
Shiva Prajapati
|

Updated on: Sep 21, 2022 | 11:15 AM

Share

Bengaluru SS SPARSH Hospital: బెంగళూరులో ఓ 65 ఏళ్ల మహిళకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. సంవత్సరం క్రితం మ్యూకోర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్), కోవిడ్19 నుంచి కోలుకున్న రోగి కళ్లు, ముక్కు నుంచి 145 మాగ్గోట్(పురుగులు)లను తొలగించారు వైద్యులు. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లోని ఎస్ఎస్ స్పార్ష్ హాస్పిటల్‌లో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఆస్పత్రి వైద్యులు ప్రకటన ప్రకారం.. బాధిత వ్యక్తి ముక్కు, కంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు చేయగా.. కన్ను, ముక్కు లోపల చనిపోయిన కణజాలాంలో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగించారు వైద్యులు.

మూడు నెలల క్రితం బాధిత వ్యక్తికి వేరే చోట చికిత్స చేయించుకుంది. అయినప్పటికీ తగ్గకపోగా.. మరోసారి ఆమె కంటిలో వాపుతో పాటు ఇతర ఇబ్బందికర లక్షణాలు కనిపించాయి. దాంతో ఆమె ఎస్ఎస్ స్పార్ష్ ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఎడమ కన్ను పూర్తిగా మూసుకుపోయింది. పరీక్ష చేసిన వైద్యులు.. ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. తొలుత ముక్కులో చనిపోయిన కణజాలాల తొలగింపుతో పాటు, సుమారు 110 మాగ్గోట్‌లను తొలగించారు. కన్ను పూర్తిగా చెడిపోవడంతో.. ఆ కన్ను తొలగించాల్సి వచ్చింది. మరుసటి రోజు చేసిన శస్త్రచికిత్సలో కంటి నుంచి దాదాపు 35 మాగ్గోటల్‌లను తొలగించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.

ఎస్ఎస్ స్పార్ష్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మంజునాథ్ ఎంకే ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘రెండు రోజుల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్సను ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విధానంలో చేశాం. మాగ్గోటల్‌లను ఎండోస్కోప్ సహాయంతో తొలగించడం జరిగింది. ఎండోస్కోప్‌ను ముక్కు ద్వారా లోపలికి పంపి.. కెమెరా మానిటర్‌ను చూస్తూ చనిపోయిన కణజాలాలు తొలగించడం జరిగింది. కంటి శస్త్రచికిత్సలో పూర్తిగా పాడైపోయిన కనుగుడ్డును తొలగించి.. అక్కడ ఉన్న మాగ్గోటల్‌లను తొలగించడం జరిగింది. ఈ ప్రక్రియ రెండు రోజులలో 1.5-2 గంటలు పట్టింది. మొదటి రోజు నాసికా కుహరం నుంచి మాగ్గోట్‌లను తొలగించగా, రెండవ రోజు ఐబాల్ నుంచి తొలగించడం జరిగింది.’ అని ఆయన వివరించారు. ప్రస్తుత రోగి పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని డాక్టర్ మంజునాథ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

‘నాసికా కావిటీస్ క్రస్ట్‌కు దారితీసే స్రావాలకు ఎక్కువ అవకాశం ఉంది. పరిశుభ్రంగా ఉండటానికి నోస్ డౌచింగ్ సాధన చేయాలి. లేదంటే.. దుర్వాసనతో కూడిన స్రావాలు ముక్కులో గుడ్లు పెట్టే క్రిములను ఆకర్షిస్తాయి. అవి చివరికి మాగ్గోట్‌లుగా మారుతాయి. ఆ మాగ్గోటల్‌ను తొలగించకపోతే మెదడుకు చేరి, మెదడు కణజాలాలను దెబ్బతీస్తాయి. కన్ను నేరుగా మెదడుకు అనుసంధానించబడి ఉంటుంది. ఫలితంగా కంటికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. అది అత్యవసర పరిస్థితికి దారితీస్తుంది.’ అని డాక్టర్ మంజునాథ్ ఎంకే వివరించారు.

జర్నల్ ఆఫ్ నేపాల్ మెడికల్ అసోసియేషన్ 2021 పరిశోధన ప్రకారం.. మాగ్గోట్‌లు ముక్కు, చెవి, ఆర్బిట్, ట్రాకియోస్టోమీ గాయం, ముఖం, చిగుళ్ళు, సీరస్ కావిటీస్‌లో ఉంటాయి. రోగులకు వివిధ రకాల గాయాలు, కొమొర్బిడిటీలు ఉంటే.. మాగ్గోట్‌లను మరింత ఆకర్షి్స్తాయని పేర్కొన్నారు.

145 Maggots

145 Maggots

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..