Sounds in Village: వింత శబ్దాలతో ఆ గ్రామంలో భయం భయం..! ఈ గ్రామానికి 28 కి.మీ దూరంలోనే కిల్లారి అనే..
మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మిస్టరీ శబ్దాలు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత వారం రోజులుగా భూమి లోపల నుంచి శబ్దాలు వస్తుండడంతో స్థానికులు వణికిపోతున్నారు.
మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మిస్టరీ శబ్దాలు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత వారం రోజులుగా భూమి లోపల నుంచి శబ్దాలు వస్తుండడంతో స్థానికులు వణికిపోతున్నారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.. ఈ మిస్టరీ శబ్దాలకు కారణాలను తెలుసుకునేందుకు నిపుణులను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది.లాతూర్ జిల్లాలోని హసోరి గ్రామంలో కొన్ని రోజులుగా భూగర్భం నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ గ్రామానికి 28 కి.మీ దూరంలోనే కిల్లారి అనే ఊరుంది. 1993లో అక్కడ సంభవించిన భారీ భూకంపంలో 9700 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హసోరి గ్రామంలోనూ భూమి నుంచి ధ్వనులు వస్తుండడంతో భూకంపం కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పటి విషాదాన్ని గుర్తుచేసుకుంటూ భయంతో వణికిపోతున్నారు. అయితే, ప్రస్తుతానికి అక్కడ భూకంప సూచికలు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
భారతీయ వీధికుక్కకు అమెరికన్లు ఫిదా.. శాంతియాత్రలో శునకం
మూడు గంటలు తాటిచెట్టుపై వేలాడుతూ గీత కార్మికుడు
78 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ గ్రామానికి తొలిబస్సు
గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి
ఓర్నీ ఏందిరా ఇదీ.. ఇంకెక్కడా చోటు దొరకలేదా నీకు!
పాముకు చేత్తో ఆహారం పెట్టాడు !! కట్ చేస్తే.. చేతి వేలు కాస్తా..
ఎంతైనా అమ్మ.. అమ్మే.. ఇంటికొచ్చిన కొడుక్కి వెరైటీ వెల్కమ్..

