Gum Arabic Tree: అనేక వ్యాధులకు చెక్ పెట్టే ‘నల్ల తుమ్మ’ గ్రీకు ఆయుర్వేద వైద్యంలో ఇప్పటికీ ఉపయోగిస్తున్న వైనం..

Gum Arabic Tree Ayurveda Benefits: భారతీయ సంప్రదాయ అతిపురాతన వైద్యం ఆయుర్వేదం. ఈ వైద్యంలో ఉపయోగించే ఔషధాలు మొత్తం  మన చుట్టు పక్కల ఉండే మొక్కల..

Gum Arabic Tree: అనేక వ్యాధులకు చెక్ పెట్టే 'నల్ల తుమ్మ' గ్రీకు ఆయుర్వేద వైద్యంలో ఇప్పటికీ ఉపయోగిస్తున్న వైనం..
Gum Arabic Tree
Follow us

|

Updated on: Sep 30, 2021 | 8:13 AM

Gum Arabic Tree Ayurveda Benefits: భారతీయ సంప్రదాయ అతిపురాతన వైద్యం ఆయుర్వేదం. ఈ వైద్యంలో ఉపయోగించే ఔషధాలు మొత్తం  మన చుట్టు పక్కల ఉండే మొక్కల నుంచి మూలికలు, ఔషధాల ద్వారా తయారవుతూ ఉంటాయి. అయితే చాలా రకాల మూలికలు ఔషధాల చెట్లు అనేవి మన చుట్టుపక్కలే ఉంటాయి కానీ మనకు అస్సలు తెలియదు. అలాంటి ఒక ఔషధాల గని నల్ల తుమ్మ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

దట్టమైన ముళ్ళతో పెరిగే తుమ్మ చెట్టు పల్లెల్లో పెరిగిన చాలామంది చిన్నతనంలో చూసే ఉంటారు. ఇది ఫాబేసి కుటుంబం లోని ఆకేసి అనే జాతికి చెందిన మొక్క. ఈ చెట్టు కి ఎక్కువగా ముళ్ళు అనేవి పదునుగా ఉంటాయి. నల్లని బెరడు, పసుపు రంగులో పూలు ఉంటాయి. ఇక తుమ్మకాయలు  పొడవుగా పెరిగే ఉంటాయి. ఈ తుమ్మ చెట్టులో నల్ల తుమ్మ, తెల్ల తుమ్మ, ఆస్ట్రేలియా తుమ్మ, నాగ తుమ్మ, సర్కారు తుమ్మ అంటూ దాదాపు 160 రకాల తుమ్మ జాతి చెట్లు ఉన్నాయి. ఇక ఎండిన తుమ్మ చెట్టు కొమ్మలను కంచెలుగా పంట పొలాలను పశువుల నుండి రక్షించడానికి చాలా మంది రైతులు ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ చెట్టు బొమ్మలు, ఫర్నిచర్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక తుమ్మ చెట్టు ఆకులు, బెరడు,  చిగురు, తుమ్మ కాయల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని గ్రీకు తత్వవేత్త, వైద్యుడు ‘వృక్షశాస్త్ర పితామహుడు’ డిస్కోకోరైడ్స్  తాను చేసే వైద్యంలో నల్ల తుమ్మ చెట్టు ఆకులు, పువ్వులు, కాయలను ఉపయోగించేవారని తెలుస్తోంది. లేత ఆకులు, రెమ్మలు, లేత కాయలు కూరగాయలుగా వాడుకుంటారు.

ఈ గమ్ అరబిక్ చెట్టును విరేచనాలు, విరేచనాలు, కుష్టు వ్యాధి, దగ్గు, పేగు నొప్పులు, క్యాన్సర్లు, కణితులు, జలుబు, రద్దీ, క్షయ, కాలేయం, ప్లీహం వ్యాధులు, జ్వరాలు, పిత్తాశయం సమస్యలు వంటి అనేక రకాల పరిస్థితులకు చికిత్సగా సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. రుతుక్రమంలో వచ్చే నొప్పులనుంచి నివారణకోసం నల్లతుమ్మ ఆకులు మంచి ఔషధం. లేత నల్లతుమ్మ ఆకులను తీసుకుని మెత్తగా నూరండి. ఆ రసాన్ని తాగితే నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి రక్తస్రావం, రక్తస్రావం, ల్యుకోరియా, ఆప్తాల్మియా, స్క్లెరోసిస్, మశూచి, నపుంసకత్వం వంటి అనేక వ్యాధుల నివారణకు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. నల్ల తుమ్మ విత్తనాలను మొలకెత్తించి కూరగాయగా తినవచ్చు. వాటిని ఆల్కహాల్ పానీయంలో పులియబెట్టానికి ఉపయోగిస్తారు. పువ్వులతో వడలు తయారు చేస్తారు. ఇక నల్లతుమ్మ బెరడు కూడా చాలా మంచిది. దాంతో కషాయాన్ని తయారు చేసుకుని రోజూ పుక్కిలించి ఉమ్మిస్తే చాలు నోటి అల్సర్ అనేది రాదు. నల్ల తుమ్మ బంకను బాగా చూర్ణంలా చేసుకుని దాన్ని ఆవుపాలలో కలుపుకుని తాగితే.. దీంతో విరిగిపోయిన ఎముకలు కూడా త్వరగా అతుక్కుంటాయి. నల్ల తుమ్మ  బెరడు నుండి ‘సాక్’ అని పిలువబడే వైన్ తయారు చేస్తారు. కాగితం తయారీలో, కొవ్వొత్తులు, సిరాలు, అగ్గిపుల్లల పరిశ్రమలో, పెయింట్సు తయారీలో దీనిని ఉపయోగిస్తారు. సన్నని కొమ్మల బెరడు నుండి వచ్చే ఫైబర్ ముతక తాడులు, కాగితాలను తయారు చేయడానికి, టూత్ బ్రష్ల కోసం ఉపయోగిస్తారు.

Also Read: Dog Meat Ban: శతాబ్దాల సంప్రదాయ ఆహారం కుక్క మాంసంపై ఇక నిషేధం.. కీలక ఆదేశాలు జారీ చేసిన దేశ అధ్యక్షుడు..