Dog Meat Ban: శతాబ్దాల సంప్రదాయ ఆహారం కుక్క మాంసంపై ఇక నిషేధం.. కీలక ఆదేశాలు జారీ చేసిన దేశ అధ్యక్షుడు..
Dog Meat Ban: ఆ దేశంలోని ప్రజలు ఇక పై కుక్కమాంసం తినలేరు.. అంతేకాదు అమ్మకం కూడా జరపలేరు.. ఇక నుంచి తమ దేశ ప్రజలు కుక్క మాంసం..
Dog Meat Ban: ఆ దేశంలోని ప్రజలు ఇక పై కుక్కమాంసం తినలేరు.. అంతేకాదు అమ్మకం కూడా జరపలేరు.. ఇక నుంచి తమ దేశ ప్రజలు కుక్క మాంసం తినకూడదని ఆ దేశ అధ్యక్షుడు నిషేధం విధించాడు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకొక్క దేశంలో ఒకొక్క సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. ఆచార వ్యవహారాలు, తినే ఆహారం అన్ని విభిన్న పద్దతులతో ఉంటాయి. ఒక దేశంలో తినే ఆహారం.. మరొక దేశంవారికి ఆమ్మో అనిపించవచ్చు.. ఇక చైనావారు తినని ఆహారం అంటూ ఏమీ ఉండదు.. పాకేవి, ఈదేవి, ఎగిరేవి అన్ని తింటారన్న సంగతి తెలిసిందే.. మరో ఆసియా దేశమైన దక్షిణ కొరియాలో కూడా కొన్ని శతాబ్దాలుగా కుక్కమాసం తినే సంప్రదయం ఉంది. అయితే తాజాగా ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తమ దేశంలో కుక్క మాంసంతినడాన్ని నిషేధిస్తున్నామని అధికార కార్యాలయ వర్గాలు ప్రకటించాయి.
దక్షిణ కొరియాలో కుక్క మాంసం తినడం పురాతనమైన ఒక ఆచారంగా వస్తున్నది. దీంతో అక్కడ కుక్కమాసం వంటకాల్లో ఒకభాగం. ఇంకా చెప్పాలంటే ఆ దేశంలో సుమారు 1 మిలియన్ కుక్కలు తింటారని అంచనా. అయితే ఇప్పటి తరాలు ఆ సంస్కృతి ఏవగించుకుంటున్నారు. ముఖ్యంగా యువత శునకాలను తినడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కుక్కలను పెట్ డాగ్‌లుగా పెంచుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. అయితే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కూడా జంతు ప్రేమికుడు. కుక్కలను పెంచుకుంటున్నాడు. దేశంలోని వస్తున్న మార్పుల రీత్యా, ఆయన స్వతహాగా జంతు ప్రేమికుడు కావడం చేత వాటిని తినడాన్ని నిషేధించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన సమావేశంలో మూన్ ప్రధానమంత్రి కిమ్ బూ-క్యూమ్‌తో మాట్లాడుతూ.. కుక్క మాంసం వినియోగం నిషేదించడాన్ని వివేకంతో పరిగణించాల్సిన సమయం రాలేదా? అంటూ ప్రశ్నించారు. ఇక ఇదే విషయంపై మరోవైపు జంతు హక్కుల కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది.
కుక్కమాసం నిషేధం పై అక్కడ బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ కొరియా జంతు సంరక్షణ చట్టం.. ప్రధానంగా కుక్కలు, పిల్లుల క్రూరమైన వధను అడ్డుకోవడానికి ఉద్దేశించబడిందే కానీ వినియోగాన్ని నిషేధించదు. ఈ నెలలో చేసిన ఓ సర్వే రిపోర్ట్ ప్రకారం 78% మంది కుక్క, పిల్లి మాంసం ఉత్పత్తులను, విక్రయాలను నిషేదించాలని కోరగా, 49% మంది మాంసం వినియోగ నిషేదాన్ని సమర్థించారు.
కుక్క మాసం నీదేశంపై జంతు ప్రేమికులు, వాటి హక్కుల కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే డాగ్ ఫార్మింగ్ ఇండస్ట్రీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. దేశంలో కనీసం 3000 కుక్కల ఫామ్‌లు ఉన్నాయి. ఈ పరిశ్రమపైనా వేలాది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. దీంతో కుక్క మాంసంపై నిర్ణయాన్ని పౌరుల వ్యక్తిగతానికి వదిలిపెట్టాలని, పాలకులు తీసుకోవాల్సిన నిర్ణయం కాదని కొరియా డాగ్ మీట్ అసోసియేషన్ సెక్రెటరీ జనరల్ జు యాంగ్ బోంగ్ చెప్పారు. అంతేకాదు మనది శునకం మాంసం భుజించే సంస్కృతిగా గర్వించాలని తెలిపారు. ఈ అసోసియేషన్‌లో కనీసం నాలుగు వేల డాగ్ మీట్ ఫార్మర్స్ ఉన్నారు. కుక్క మాంసం విక్రేతలు తమ వృత్తిపై హక్కు కోసం పట్టుబడుతూ, వారి జీవనోపాధి ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: