Inzamam-ul-Haq: గుండెపోటు కాదు.. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళితే.. ఇలా జరిగింది: ఇంజమామ్
Former Pakistan captain Inzamam-ul-Haq: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం ఆయనకు
Former Pakistan captain Inzamam-ul-Haq: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం ఆయనకు యాంజియోప్లాస్టీ విజయవంతంగా జరిగింది. అయితే.. గత మూడు రోజులుగా ఆయన గుండెనొప్పితో బాధపడుతున్నారని.. ఆసుపత్రిలో చేరగా ఆయనకు సర్జరీ జరిగినట్లు ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై ఇంజమామ్ వుల్ హక్ స్పందించాడు. గుండెపోటుకు గురయ్యానంటూ మీడియాలో వస్తున్న వార్తలను హక్ ఖండించాడు. తనకెలాంటి గుండెపోటు రాలేదని..కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే గుండెలో సమస్య విషయం బయటపడిందంటూ పేర్కొన్నాడు. గుండె చికిత్సలో భాగంగా స్టంట్ వేసి వైద్యులు సమస్యను పరిష్కరించారని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ స్పష్టం చేశాడు. ఈ మేరకు బుధవారం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశాడు. కడుపులో నొప్పి రావడంతో ఇంజమామ్ సోమవారం రాత్రి లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా వైద్యులు యాంజియోగ్రఫీ నిర్వహించారు. ఈ క్రమంలో గుండెలో రక్త నాళం ఒకటి కాస్త మూసుకుపోయి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో స్టంట్ అమర్చి సమస్యను పరిష్కరించారు. 12 గంటల వైద్యుల పర్యవేక్షణ అనంతరం ఇంజమామ్ ఇంటికి వెళ్లిపోయాడని వైద్యులు తెలిపారు.
1992 వరల్డ్‌కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడైన ఇంజమామ్.. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. 51 ఏళ్ల ఇంజమామ్ 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి.. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా నిలిచాడు. 375 మ్యాచ్‌ల్లో 11701 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్థానీ ఆటగాళ్లల్లో మూడో స్థానంలో నిలిచాడు. 119 మ్యాచ్‌ల్లో 8829 పరుగులు చేశాడు. 2007 లో ఇంజమామ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. పదవీ విరమణ తర్వాత కూడా.. ఆయన పాకిస్తాన్ క్రికెట్‌కు సేవలందించాడు. పలు ముఖ్యమైన పదవులను సైతం నిర్వహించారు.
Also Read: