PM-Poshan Scheme: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రీ ప్రైమరీ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం

Mid-day Meal Scheme : కేంద్రంలోని మోదీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల్లో ఇప్పటికే అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. పోషకాహార

PM-Poshan Scheme: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రీ ప్రైమరీ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
Pm Poshan Scheme
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 30, 2021 | 7:11 AM

Mid-day Meal Scheme: చిన్నారుల్లో పోషకాహారలోపాన్ని అరికట్టేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమలవుతున్న ప్రభుత్వ పాఠశాల్లో ఇప్పటికే అమలవుతున్నర మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్లో నడుస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు (3-6 ఏళ్ల పిల్లలకు) కూడా ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధానమంత్రి-పోషణ్‌ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో నర్సరీ, కేజీ, యూకేజీ విద్యార్థులకు కూడా పోషకాహారం లభించనుంది. చిన్న పిల్లలకు సైతం పోషక ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న జాతీయ మధ్యాహ్న భోజన పథకం (Midday Meal Scheme) పేరును ప్రధానమంత్రి పోషణ్‌ పథకంగా మారుస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు 24 లక్షలమందికి పైగా ప్రీ-ప్రైమరీ విద్యార్థులను కూడా ఈ స్కీమ్‌లో భాగం చేస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు మధ్యాహ్న భోజన పథకం కింద 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు పోషకాహారం అందించేవారు. ఈ నిర్ణయంతో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కూడా పోషకాహారం లభించనుంది.

బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఎం పోషణ్‌ స్కీమ్‌లో భాగంగా కేంద్రం మరికొన్ని అంశాలపైనా దృష్టి సారించింది. స్థానిక మహిళలను ఇందులో భాగం చేస్తూ వారికి తోట పనితోపాటు.. భోజనం రుచిగా వండేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. పీఎం పోషణ్‌ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 11.2 లక్షల పాఠశాలల్లోని 11.80 కోట్ల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఐదు సంవత్సరాలకు గాను కేంద్ర ప్రభుత్వం 1,30,795 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఈ నిధులను రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేటాయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు 54,061,73 కోట్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 31733,17 కోట్లు కేటాయించున్నారు.

దీంతోపాటు ఆహార ధాన్యాల కోసం అదనంగా కేంద్రం మరో రూ.45,000 కోట్లు భరించనుంది. రానున్న ఐదేళ్లలో ఈ స్కీమ్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తంగా రూ.1,30,795 కోట్లు ఖర్చు చేయనున్నాయని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. అయితే ఈ పథకం కింద అందించే ఆహార పదార్థాలను ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదని, రాష్ట్రాలు సొంతంగా నిర్ణయించుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఇది వరకే 9, 10వ తరగతుల విద్యార్థులకు ఈ పథకాన్ని అమలుచేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:

AP Crime News: భార్య, అత్తమామ వేధింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్న అల్లుడు..

Bank New Rules: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా..? అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!