AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: భార్య, అత్తమామ వేధింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్న అల్లుడు..

AP Crime News:దంపతులు నిండునూరేళ్ళు సుఖసంతోషంతో కలిసి ఉండాలంటే.. ఇరువురు మధ్య నమ్మకమే పునాది. అది లేకపోతే ఇరువురు మధ్య మనస్పర్థలు వస్తాయి.. వివాదాలు..

AP Crime News: భార్య, అత్తమామ వేధింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్న అల్లుడు..
Crime News
Surya Kala
|

Updated on: Sep 30, 2021 | 6:28 AM

Share

AP Crime News:దంపతులు నిండునూరేళ్ళు సుఖసంతోషంతో కలిసి ఉండాలంటే.. ఇరువురు మధ్య నమ్మకమే పునాది. అది లేకపోతే ఇరువురు మధ్య మనస్పర్థలు వస్తాయి.. వివాదాలు ఏర్పడతాయి.. ఒకొక్కసారి నిండుప్రాణాలను సైతం తీసుకునేలా చేస్తాయి. అయితే ఇప్పటివరకూ ఎక్కువగా అత్తింటివారు పెట్టె బాధలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కోడళ్ళగురించి విన్నాం.. చూసాం.. తాజాగా అత్తింటి రాళ్లతో ఉసురు తీసుకున్నాడు ఓ అల్లుడు.. నిండు సంసారంలో ఒక చిన్న ఫోన్ కాల్ చిచ్చు పెట్టింది. నిండు జీవితాన్ని బలిదీసుకుంది.  ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని జగ్గయ్యపేట కు చెందిన వెంకటేష్ కు నాలుగేళ్ల క్రితం తెలంగాణ కు చెందిన కృష్ణ వేణి తో వివాహం జరిగింది. వెంకటేష్ కృష్ణవేణి దంపతులు చాలా అన్నోన్యంగా ఉండేవారు. భార్య అంటే వెంకటేష్ కు అమితమైన ప్రేమ.. ఎంతగా అంటే భార్యపేరు తన చేతిమీద పచ్చబొట్టు వేయించుకునేంత. నాలుగేళ్లు సజావుగా సాగిన ఈ దంపతుల  జీవితం లో ఒక్క ఫోన్ కాల్ వారి సంసార జీవితంలో చిచ్చుపెట్టింది. నాలుగు నెలలు నరకం చూసి తనువు చాలించాడు వెంకటేష్. నాలుగు నెలల క్రితం కృష్ణవేణి ఫోన్ లో మాట్లాడుతున్న సమయం లో భర్త వెంకటేష్ ఇంటికి వచ్చాడు.. అయితే భర్త ని కృష్ణ వేణి ఫోన్ కట్ చేసింది. దీంతో వెంకటేష్ ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ భార్యని నిలదీశాడు. మా అక్కతో మాట్లాడుతున్నాను అని సమాధానం చెప్పింది కృష్ణవేణి. దీంతో వెంటకటేష్ భార్య ఫోన్ తీసుకుని అదే నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చాడు. వెంటనే మళ్ళీ ఆ నెంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుండి మీ ఆయన వచ్చాడా ఫోన్ కట్ చేసావ్ అన్న మగ గొంతు మాటలు వినిపించాయి. అంతే అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ మోడలింది. చివరికి పెద్ద మనుషుల పంచాయితీకి అక్కడనుంచి పోలీస్ స్టేషన్ గడపకు ఎక్కింది. భార్య ని వేధిస్తున్నాడని కృష్ణ వేణి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు వెంకటేష్ కుటుంబ సభ్యుల పై దాడి కూడా చేశారు.

వెంకటేష్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగ లేక పెద్ద మనుషుల పంచాయతీ లలో అవమానాలు భరించలేక.. వెంకటేష్ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. తన మృతి కి భార్య, అత్తింటి వారే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకొని వెంకటేష్ తన మెకానిక్ షెడ్డు లో ఉరి వేసుకొని ఉసురు తీసుకున్నాడు.  అంతేకాదు తనకు పెద్ద మనుషుల తీర్పు నచ్చలేదని వేరే కాపురం పెట్టి .. తమ ఊరులో నుంచి వెళ్ళిపోయి.. కోదాడ లో ఉండమన్నారని అది ఇష్టం లేదని తెలిపాడు.. వేరే కాపురం పెట్టడం ఇష్టంలేకనే సూసైడ్ చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో లో తెలిపాడు. వెంకటేష్ కుటుంబ సభ్యులు ఈ విషయంపై మాట్లాడుతూ.. నాలుగేళ్ళ వాళ్ళ వివాహ జీవితంలో ఫోన్ కాల్ రాక ముందు భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యం గా ఇద్దరు ఉండేవారని తెలిపారు. నాలుగు నెలలక్రితం వచ్చిన ఫోన్ కాల్ తర్వాత అన్ని గొడవలు కేసులు వచ్చాయని అన్నారు. తమ కుమారుడు అత్త మామ మధ్యవర్తులు పెద్ద మనుషులు.. వెంకటేష్ మృతికి కారణమని వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కృష్ణవేణి కుటుంబ సభ్యులపై జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ లో  వెంకటేష్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:

డయాబెటిస్‌ ఉన్నవారు ఈ పండ్లను తినవచ్చా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు