Diabetes : డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను తినవచ్చా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?
Diabetes : ప్రస్తుతమున్న కాలంలో డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి ఇంటికి షుగర్ వ్యాధి ఉన్న వారు ఉంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారు..
Diabetes : ప్రస్తుతమున్న కాలంలో డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి ఇంటికి షుగర్ వ్యాధి ఉన్న వారు ఉంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారు తిండి విషయంలో చాలాసార్లు నోరు కట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఏది తినాలన్నా ముందు వెనుక ఆలోచించాల్సి ఉంటుంది. షుగర్ కారణంగా ఎలాగూ స్వీట్లు తినలేరు.. ఆరోగ్యాన్నిచ్చే పండ్లు తినాలన్నా ఎన్నో సందేహాలు వస్తున్నాయి. పండ్లలోనూ చక్కెరస్థాయిలు ఉంటాయి కాబట్టి ఏవి తినొచ్చు.. ఏవి తినరాదు అనే అనుమానాలు చాలా ఉంటాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
జామ కాయ:
డయాబెటిస్ ఉన్నవారికి జామ ఎంతో మంచిది. జామలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. జామకాయలో విటమిన్ ఏ, సీతో పాటు వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
పుచ్చకాయ:
పుచ్చకాయ తియ్యగా ఉండటం వల్ల దీన్ని తినొచ్చా లేదా అని చాలామందికి ఓ సందేహం ఉంటుంది. అయితే పుచ్చకాయ విషయంలో ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే ఆయా ఆహార పదార్థాల్లోని గ్లూకోజ్ రక్తంలో ఎంత వేగంగా కలుస్తుందనేదాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ)తో సూచిస్తారు. పుచ్చకాయ తినడం వల్ల డయబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చు. పుచ్చకాయలో జీఐ 72 శాతం ఉంటుంది. కానీ ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండి పిండిపదార్థం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తిన్నప్పుడు వెంటనే గ్లూకోజ్ పెరిగినప్పటికీ వెంటనే తగ్గిపోతుంది.
రేగు పండ్లు:
రేగు పండల్లో క్యాలరీలతో పాటు గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా షుగర్ వ్యాధి ఉన్నవారు తినవచ్చు.
యాపిల్:
ప్రతిరోజు యాపిల్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతుంటారు. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాపిల్‌లో పెక్టిన్ అనే ఒక రసాయనం ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరను సగానికి తగ్గిస్తుంది. దీని జీఐ 38 మాత్రమే. అందుకే యాపిల్ తినడం మంచిదే. అయితే యాపిల్ పెద్ద సైజ్‌లో ఉంటే సగం తింటే చాలు.
బొప్పాయి:
డయాబెటిస్ ఉన్నవారు బొప్పాయిని తప్పకుండా తినాలి. ఈ బొప్పాయి డయాబెటిస్‌ను అదుపులో ఉంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో హానికరమైన ఫ్రీరాడికల్స్ నుంచి షుగర్ వ్యాధిగ్రస్తులను రక్షించే ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.
ఆరెంజ్:
ఆరెంజ్‌లో జీఐ తక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, సీ, ఈ, ల్యూటిన్, బీటాకెరోటిన్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహ రోగుల్లో షుగర్ లెవల్స్‌ను అదుపు చేయడంలో దోహదం చేస్తాయి.
దానిమ్మ:
దానిమ్మలో జీఐ 18గా ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంచుకోవచ్చు.
నిమ్మకాయ:
సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇందులో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఇవి శరీరంలోని చక్కెరస్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
కివీస్:
ఇందులో విటమిన్ సీ, ఫైబర్, పొటాషియం, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కివీస్‌లో అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అందుకే కివీస్ తినడం వల్ల డయాబెటిస్ తీవ్రత తగ్గుతుంది.