AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఉదయం లేవగానే పడిగడుపున ఇది తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

జీరా ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం చాలా మందికి తెలుసు. అందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఔషద గుణాలు చలికాలంలోనే కాదు.. ఏ కాలంలోనైనా అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. అయితే జీలకర్రను నేరుగా కాకుండా.. నీళ్లతో కలిపి తీసుకుంటే.. మరిన్ని ప్రయోజనాలు..

Health: ఉదయం లేవగానే పడిగడుపున ఇది తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Jeera Water
Amarnadh Daneti
|

Updated on: Nov 19, 2022 | 9:53 PM

Share

జీరా ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం చాలా మందికి తెలుసు. అందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఔషద గుణాలు చలికాలంలోనే కాదు.. ఏ కాలంలోనైనా అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. అయితే జీలకర్రను నేరుగా కాకుండా.. నీళ్లతో కలిపి తీసుకుంటే.. మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. నేటి బిజీ షెడ్యూల్‌లో ఆరోగో్యంపై శ్రద్ధ తీసుకోవడం తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయమం, వాకింగ్ వంటి వాటిని చేయడానికి సమయం కేటాయించలేకపోతున్నాం. దీంతో చిన్న వయస్సులోనే శరీరం మనకు మద్దతు ఇవ్వడం మానేస్తుంది. కొన్నిసార్లు మనం పూర్తిగా మెడిసన్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇలా ఔషదాల మీద ఎక్కువగా ఆధారపడటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వంటగదిలోని చాలా పదార్థాలు.. అనేక వ్యాధుల నుంచి రక్షించగలవంటున్నారు. వంటింట్లో ఉండే జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్నీ ఆరోగ్యంగా ఉంచడంలో జీలకర్ర బాగా సహాయపడుతుంది. దానిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం ప్రారంభిస్తే.. అనేక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.

గర్భిణులకు

గర్భధారణ సమయంలో జీలకర్ర నీటిని తాగడం ప్రారంభిస్తే.. జీర్ణవ్యవస్థ బలంగా మారుతుందంటున్నారు నిపుణులు. గర్భిణులు జీలకర్ర నీటిని తాగడం వలన కార్బోహైడ్రేట్లు, కొవ్వుల జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లకు ఉద్దీపనగా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి

జీలకర్రలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ జీలకర్ర నీటిని తాగడం ప్రారంభిస్తే.. రోగనిరోధక శక్తి చాలా బలంగా మారుతుంది. అనేక వ్యాధులతో పోరాడటం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు

మధుమేహ వ్యాధిగ్రస్తులకు జీలకర్ర నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి రోగులు రోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగితే.. వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జీలకర్ర శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

రక్తపోటును నియంత్రణ

జీలకర్ర నీటిలో చాలా పొటాషియం లభిస్తుంది. ప్రతిరోజూ జీలకర్ర నీటిని తాగడం ప్రారంభిస్తే.. రక్తపోటు ఎల్లప్పుడూ అదుపులో ఉంటుంది.

శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం

జీలకర్ర నీరు శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. శ్వాస సంబంధిత సమస్య ఏదైనా ఉంటే.. ఉదయాన్నే ఒక గ్లాసు జీలకర్ర నీటిని తాగితే మంచిదంటున్నారు నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..