AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రిజ్‌ లో మాంసం పెడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..? లేకుంటే అంతే సంగతి

మనలో చాలా మంది తమ అవసరానికి మించి మాంసం కొనుగోలు చేసి మిగిలిన భాగాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. అయితే ఇది జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యానికి హానికరమైనదిగా మారవచ్చు. నిపుణుల సూచనల ప్రకారం మాంసాన్ని కరెక్ట్ వే లో నిల్వ చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది.. ఇది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

ఫ్రిజ్‌ లో మాంసం పెడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..? లేకుంటే అంతే సంగతి
Non Veg Storage Mistakes
Follow us
Prashanthi V

|

Updated on: May 09, 2025 | 7:32 PM

ఈ. కొలి (Escherichia coli) అనే సూక్ష్మజీవి ఫ్రిజ్‌లో ఉంచిన మాంసం మీద చేరే ప్రమాదం ఉంది. ఈ బ్యాక్టీరియా మనకు కనిపించదు.. వాసనతో కూడా గుర్తించలేము. కానీ ఇది శరీరంలో ప్రవేశించడంలో విపరీతమైన ప్రమాదం కలిగించవచ్చు. ఫ్రిజ్ నుండి మాంసాన్ని బయటకు తీసుకున్నప్పుడు ఈ సూక్ష్మజీవులు మన చేతులకు అంటుకునే అవకాశం ఉంటుంది. తరువాత అవి నోరు, ముక్కు లేదా కంటి ద్వారా మన శరీరంలోకి చేరే అవకాశం ఉంది.

ఈ బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశించిన వెంటనే జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు మొదలవుతాయి. వాంతులు, బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే అధిక వేడి, పొట్ట నొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఈ సూక్ష్మజీవుల ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది.

మహిళలు ముఖ్యంగా ఈ బ్యాక్టీరియాతో అధికంగా ప్రభావితమవుతారు. ఈ బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ను కలిగించే అవకాశం ఉంది. తరచుగా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాన్ని వాడే మహిళల్లో మూత్ర సంబంధ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను పట్టించుకోకపోతే.. అది కిడ్నీకి కూడా హాని చేస్తుంది.

ఈ మాంసాన్ని సరైన రీతిలో ఉడకబెట్టకపోతే ఫ్రిజ్‌లో ఉన్న బ్యాక్టీరియా నాశనం కాకుండా మిగిలిపోతుంది. అలా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల తీవ్రమైన అలర్జీ, విరేచనాలు, చర్మంపై ఎరుపు గాట్లు, దురద వంటి సమస్యలు రావచ్చు. ఈ పరిస్థితిలో శరీరంలో వైకల్యాలు కూడా రావచ్చు.

మాంసాన్ని కరెక్ట్ గా నిల్వ చేయాలంటే సరైన విధానాలు పాటించడం చాలా ముఖ్యం. మాంసం పోషక విలువలు కాపాడాలంటే దాన్ని శుభ్రంగా కడగటం మొదటిది. తర్వాత గాలి చొరబడకుండా ఉండే కంటైనర్‌లో పెట్టాలి లేదా సురక్షితమైన ప్లాస్టిక్ కవర్లో వేసి మూసివేయాలి. ఇందులోని వాసన కూడా బయటకు రాకుండా చూసుకోవాలి.

ఫ్రిజ్‌లో ఉంచే ముందు మాంసాన్ని పూర్తిగా మూసివేసిన బ్యాగ్‌లో పెట్టడం మంచిది. అలాగే ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులపాటు నిల్వ చేయకూడదు. గడువు తీరే లోపే వాడటం ఉత్తమం. వండకుండా ఎక్కువసేపు ఉంచితే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. మాంసాన్ని శుభ్రంగా నిల్వ చేస్తేనే అది ఆరోగ్యానికి హానికరం కాకుండా ఉంటుంది. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాంసం పోషక విలువలను నిలుపుకుంటూ సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు.

ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాన్ని ఉపయోగించే ముందు.. అది పూర్తిగా ఉడికినట్లు నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. వండిన తర్వాత కూడా కొంత సమయం పాటు వేడిగా ఉంచడం లేదా మరోసారి బాగా వేడి చేయడం అవసరం. ఇలా చేయడం వల్ల మాంసంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. అంతేకాకుండా మాంసాన్ని ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ చేయకుండా.. వీలైనంత త్వరగా వినియోగించడం ఆరోగ్యానికి మంచిది.

మాంసాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల ఆరోగ్య ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వాటిని నివారించవచ్చు. శుభ్రంగా కడగడం, సరైన కంటైనర్లలో నిల్వ చేయడం, పరిమితి గడువు లోపలే వాడటం, పూర్తిగా ఉడికించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించవచ్చు.

ఈ జంతువులు మీకు కలలో కనిపిస్తే మీకు రాజ్యయోగం కలగనుందట..
ఈ జంతువులు మీకు కలలో కనిపిస్తే మీకు రాజ్యయోగం కలగనుందట..
SRH దెబ్బతో చెరిగిపోయిన RCB టాప్-2 కల! RCB గతేంటి?
SRH దెబ్బతో చెరిగిపోయిన RCB టాప్-2 కల! RCB గతేంటి?
తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్.. ఆపరేషన్‌ స్లీపర్‌ సెల్స్‌ షురూ..
తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్.. ఆపరేషన్‌ స్లీపర్‌ సెల్స్‌ షురూ..
3.1 ఓవర్లలో 3 పరుగులు.. 3 వికెట్లతో బీభత్సం.. కట్‌చేస్తే..
3.1 ఓవర్లలో 3 పరుగులు.. 3 వికెట్లతో బీభత్సం.. కట్‌చేస్తే..
అభిషేక్ సిక్స్ తుఫాన్.. 5 లక్షల ఫైన్! కారణం ఇదే..
అభిషేక్ సిక్స్ తుఫాన్.. 5 లక్షల ఫైన్! కారణం ఇదే..
కురుస్తున్న వర్షాలతో బయటకు వస్తున్న పాములు.. భయం... భయంగా రైతులు
కురుస్తున్న వర్షాలతో బయటకు వస్తున్న పాములు.. భయం... భయంగా రైతులు
అది ఏడుపుగొట్టు సినిమా కాదు.. కానీ కన్నీళ్లు వస్తాయి
అది ఏడుపుగొట్టు సినిమా కాదు.. కానీ కన్నీళ్లు వస్తాయి
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.! వచ్చే 3 రోజులు పిడుగుల వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.! వచ్చే 3 రోజులు పిడుగుల వర్షాలు
పీరియడ్స్ టైంలో స్త్రీలకు ఎందుకు విశ్రాంతినిచ్చారో తెలుసా..
పీరియడ్స్ టైంలో స్త్రీలకు ఎందుకు విశ్రాంతినిచ్చారో తెలుసా..
IPL 2025లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ స్టార్లు వీరే.. లిస్ట్‌లో మనోళ్లు
IPL 2025లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ స్టార్లు వీరే.. లిస్ట్‌లో మనోళ్లు