AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High BP: ఈ లక్షణాలు ఉంటే బీపీ భారీగా పెరిగినట్లే.. వెంటనే ఇలా చేస్తే ఇంట్లోనే కంట్రోల్‌ చేసుకోవచ్చు.

ఇటీవల చాలా మందిలో సహజంగా కనిపిస్తోన్న అనారోగ్య సమస్యల్లో అధిక రక్త పోటు ఒకటి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది హైబీపీ బారిన పడుతున్నారు. మారుతోన్న జీవన విధానం, ఆహారలు అలవాట్లు కారణంగా రక్తపోటు సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య...

High BP: ఈ లక్షణాలు ఉంటే బీపీ భారీగా పెరిగినట్లే.. వెంటనే ఇలా చేస్తే ఇంట్లోనే కంట్రోల్‌ చేసుకోవచ్చు.
ఆహారంతో పాటు ఊరగాయ, పచ్చళ్లను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. మీరు అధిక రక్తపోటు ఉన్న రోగి అయితే ఊరగాయలకు దూరంగా ఉండాలి.
Narender Vaitla
|

Updated on: Dec 26, 2022 | 11:43 AM

Share

High BP home remedies: ఇటీవల చాలా మందిలో సహజంగా కనిపిస్తోన్న అనారోగ్య సమస్యల్లో అధిక రక్త పోటు ఒకటి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది హైబీపీ బారిన పడుతున్నారు. మారుతోన్న జీవన విధానం, ఆహారలు అలవాట్లు కారణంగా రక్తపోటు సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగి పోతోంది. అధిక రక్తపోటు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా గుండె పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. బీపీని సకాలంలో నియంత్రించుకోకపోతే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో ఊహించని స్థాయిలో బీపీ పెరుగుతుంది. ఇంతకీ బీపీ ఒక్కసారిగా పెరిగితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఆ సమయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలి.? లాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మానసిక ఒత్తిడి, మద్యం, ఆహారంలో ఉప్పు శాతం పెరగడం కారణం ఏదైనా కొందరిలో ఒక్కసారిగా బీపీ భారీగా పెరగుతోంది. విపరీతమైన చమటలు రావడం, ముక్కులో నుంచి రక్తం కారడం, తల తిరగడం, చర్మం ఎరుపు రంగులోకి మారడం, మూత్రంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే బీపీ భారీగా పెరిగినట్లు గుర్తించాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి. ఒకవేళ వైద్యుడి అందుబాటులో లేకపోయినా, దూరంలో ఉన్న కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా అధిక రక్త పోటును కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటంటే..

పైన తెలిపిన లక్షణాలు కనిపించిన వెంటనే గుండెల నిండా శ్వాస తీసుకోవాలి. పనులన్నీ పక్కన పెట్టి కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. ఆందోళన, భయం కలిగించే అంశాల నుంచి మనుసును మళ్లించాలి. కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్‌ కారణంగా కూడా బీపీ పెరుగుతుంది. కాబట్టి వెంటనే నీటిని తాగాలి. కాసేపు గాలి బాగా వీచే ప్రదేశంలో నడవాలి. అదే విధంగా డార్క్‌ చాక్లెట్ అందుబాటులో ఉంటే నోట్లో వేసుకొని చప్పరించాలి. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కూడా అధిక రక్తపోటు కంట్రోల్‌లోకి వస్తుంది. వీటితో పాటు తీసుకునే ఆహారం ఉప్పు శాతాన్ని తగ్గించడం, మెడిటేషన్‌ వంటి వాటి వల్ల అధిక రక్తపోటును కంట్రోల్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోట్: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో డాక్టర్ల సూచనలనే ప్రామాణికంగా తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..