Eggs Benefits: ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారు..?

శరీరానికి గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో రకాల పోషకాహార విలువులుంటాయి. ఇవి శాఖహారులు కూడా తినవచ్చు. ప్రతిరోజూ గుడ్లు తింటే శరీరంలో ప్రొటిన్స్ పెరుగుతాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరుపితమైంది. ఇందులో కాల్షియం, ఐరన్ 90 శాతం ఉంటుంది..

Eggs Benefits: ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారు..?
Eggs Benefits
Follow us

|

Updated on: Apr 03, 2023 | 9:53 AM

శరీరానికి గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో రకాల పోషకాహార విలువులుంటాయి. ఇవి శాఖహారులు కూడా తినవచ్చు. ప్రతిరోజూ గుడ్లు తింటే శరీరంలో ప్రొటిన్స్ పెరుగుతాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరుపితమైంది. ఇందులో కాల్షియం, ఐరన్ 90 శాతం ఉంటుంది. అలాగే గుడ్డులో ఉండే పచ్చసోన, తెల్లటి పోరలో అత్యధికంగా ప్రోటీన్ శాతం ఉంటుంది. అందుకే గుడ్లను పోషకాహర నిధిగా పిలుస్తారు. అయితే ఇన్ని పోషకాలున్న గుడ్లను వేసవి కాలంలో తినోచ్చా లేదా అనేది తెలుసుకోవాల్సిన విషయం.

రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికి తెలిసిందే. వైద్యులు కూడా పదేపదే చెబుతుంటారు. గుడ్డు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే గుడ్డును రకరకాలుగా చేసుకుని తింటారు. కొందరేమో ఆమ్లెట్ వేసుకొని తింటే.. మరికొందరూ ఉడకబెట్టి తింటారు. ఎగ్ కర్రీ వెజిటేబుల్ తినడానికి ఇష్టపడుతారు చాలామంది. రోజుకు 4 నుంచి 5 గుడ్లు తింటారు. అయితే వేసవిలో గుడ్లు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. వేసవికాలంలో ఎక్కువగా గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా గుడ్లలో కనిపిస్తుంది. చికెన్ నుంచి అది వస్తుంది. గుడ్డును సరిగ్గా ఉడకబెట్టకపోతే ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి మీ ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో గుడ్డు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై పలు రకాల ప్రభావాలుంటాయంటున్నారు. గుడ్డులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీపై ప్రతీకూల ప్రభావముంటుంది. వేసవిలో దీనిని ఎక్కువగా వాడకూడదు.

ఇవి కూడా చదవండి

గుడ్లలో కొలెస్ట్రాల్‌:

గుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కొలెస్ట్రాల్ ఉన్నవారు రోజూ తినకూడదు. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కొందరికీ గుడ్లు అంటే ఎలర్జీ ఉంటుంది. గుడ్ల వినియోగానికి చాలా దూరంగా ఉండాలి. పరిమిత పరిమాణంలో గుడ్లను తీసుకుంటే దాని వల్ల దుష్ప్రభావాలుండవు. వేసవికాలంలో గుడ్లను మితంగా తినాలని.. అంతేకానీ మొత్తానికి తినకుండా ఉండకూడదని చెబుతున్నారు.

గుడ్లు శరీరంలో వేడిని కలుగజేస్తాయి..

గుడ్లు వేడిని ఉత్పత్తి చేసే ధోరణిని కలిగి ఉంటాయి. అలాగే శరీరానికి, అజీర్ణానికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గుడ్లు శరీరంలో వేడిని కలుగజేస్తాయి. కానీ మితంగా తింటే అద్భుతమైన ఆరోగ్యకరమైన ఫలితాలను అందిస్తుంది. వేసవిలో గుడ్లు ఎక్కువగా తింటే పేగు సమస్యలను సృష్టిస్తుంది. ఇందులో ఎముకలు బలంగా ఉండటానికి అవసరమైన విటమిన్ ఎ & డి గుడ్లు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, భాస్వరం, జింక్, అయోడిన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ఐరన్ అవసరం. శక్తి స్థాయిని అధికంగా ఉంచడంలో సహయపడుతుంది. అలాగే అలసట, బలహీనతను నివారించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..