Sperm Donor: వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు.. ప్రపంచవ్యాప్తంగా వీర్యదానం..

Sperm Donor: వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు.. ప్రపంచవ్యాప్తంగా వీర్యదానం..

Anil kumar poka

|

Updated on: Apr 03, 2023 | 9:44 AM

వీర్య దానం ద్వారా దాదాపు 550 మందికి తండ్రి అయ్యాడు సదరు డాక్టర్. ఇకపై అతడు వీర్యదానం చేయకుండా అడ్డుకోవాలంటూ ఓ మహిళ న్యాయపోరాటానికి సిద్ధమైంది.

నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వైద్యుడు వీర్యదానం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. వీర్య దానం ద్వారా దాదాపు 550 మందికి తండ్రి అయ్యాడు సదరు డాక్టర్. ఇకపై అతడు వీర్యదానం చేయకుండా అడ్డుకోవాలంటూ ఓ మహిళ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఆ మహిళ సైతం ఆయన వీర్యాన్ని ఉపయోగించే బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలోనే మరింత మంది చిన్నారులను కనకుండా ఆయన్ను నిరోధించాలని కోరుతూ డోనర్​కైండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం అనే 41ఏళ్ల వైద్యుడు.. ఇప్పటివరకు నెదర్లాండ్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్​లలో వీర్యదానం చేశాడు. ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. గరిష్ఠంగా 25 మంది చిన్నారులకు మాత్రమే జన్మనివ్వాలి. భవిష్యత్‌లో రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు తలెత్తకుండా చూడటం, పుట్టిన సంతానం మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలు రూపొందించారు. అయితే వీర్యదానం ద్వారా జొనథన్‌ వంద మందికి పైగా చిన్నారులకు జన్మనిచ్చాడని 2017లోనే తెలిసింది. దీంతో నెదర్లాండ్స్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. ది డచ్‌ సొసైటీ ఆఫ్‌ అబ్ట్సెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ అతడిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. జొనథన్‌ ప్రస్తుతం కెన్యాలో ఉన్నట్టు నెదర్లాండ్స్‌ మీడియా వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..