Viral Video: మామిడి చెట్టునుంచి ఉబికి వస్తున్న నీరు.. వైరల్ అవుతున్న వీడియో.
మామిడిచెట్టులోనుంచి నీరు ఉబికి వస్తోంది. నీరు బయటకు వస్తున్న సమయంలో శబ్ధాలు కూడా రావడంతో ఈ వింతను చూసేందుకు స్థానికులు పోటెత్తారు.
తూర్పుగోదావరి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. మామిడిచెట్టులోనుంచి నీరు ఉబికి వస్తోంది. నీరు బయటకు వస్తున్న సమయంలో శబ్ధాలు కూడా రావడంతో ఈ వింతను చూసేందుకు స్థానికులు పోటెత్తారు. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలోని డేగల రామారావు అనే వ్యక్తి ఇంటి పెరటిలో మామిడి చెట్టును పెంచారు. ప్రస్తుతం మామిడి సీజన్ కావడంతో చెట్టు నిండుగా మామిడి కాయలు కూడా కాసాయి. ఉన్నట్టుంటి ఈ చెట్టు మొదలు భాగంలోని తొర్రలోనుంచి నీరు ధారగా వస్తోంది. చెట్టు దగ్గర శబ్ధాలు వినిపించడంతో ఏమిటా అని పరిశీలించిన యజమాని చెట్టులోనుంచి నీరు రావడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా గ్రామమంతా పాకింది. దాంతో ఈ వింత ఘటనను చూసేందుకు జనం పోటెత్త్తుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

