Aadhaar, PAN: మీరు ఈ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? ఆధార్‌, పాన్‌ కార్డు విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు

మన వద్ద ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌కార్డు, పాన్‌ కార్డు. ఏ చిన్న పనికి కూడా ఆధార్‌ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ప్రతి దానికి ఆధార్‌ కావాల్సిందే. అలాగే ఆర్థిక సంబంధిత విషయాలోల పాన్‌ కార్డు కీలక పాత్ర పోషిస్తుంటుంది...

Aadhaar, PAN: మీరు ఈ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? ఆధార్‌, పాన్‌ కార్డు విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు
Aadhaar - PAN
Follow us
Subhash Goud

|

Updated on: Apr 02, 2023 | 8:31 PM

మన వద్ద ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌కార్డు, పాన్‌ కార్డు. ఏ చిన్న పనికి కూడా ఆధార్‌ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ప్రతి దానికి ఆధార్‌ కావాల్సిందే. అలాగే ఆర్థిక సంబంధిత విషయాలోల పాన్‌ కార్డు కీలక పాత్ర పోషిస్తుంటుంది. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక చత్రకు సంబంధించిన విషయాలలో పాన్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. ఇప్పుడు ఈ రెండింటి విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జూన్ 30 వరకు లింక్ చేయడానికి కేంద్రం చివరి తేదీని పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు పాన్‌, ఆధార్‌ కార్డులు ముఖ్యమని పేర్కొంది.

అందువల్ల పాన్, ఆధార్ కార్డ్ కేవైసీలో అంతర్భాగం. ఇప్పుడు చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి మీ పాన్, ఆధార్ నంబర్ తప్పనిసరి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 31న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. చిన్న పొదుపు పథకాలలో ఇప్పుడు కేవైసీ ప్రధాన భాగం. ఇంతకుముందు ఎవరైనా ఆధార్ నంబర్‌ను సమర్పించకుండానే ఇటువంటి పథకాలలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి చందాదారులు కనీసం ఆధార్ నంబర్‌ను సమర్పించాలి.

పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన సబ్‌స్క్రైబర్లు తప్పనిసరిగా సెప్టెంబర్ 30లోగా ఆధార్ నంబర్‌ను సమర్పించాలని నోటిఫికేషన్ పేర్కొంది. అలా చేయాలనుకునే వారు, కొత్త చందాదారులు ఆరు నెలల్లోగా ఆధార్ వివరాలను సమర్పించాలని పేర్కొంది. సబ్‌స్క్రైబర్‌కు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ నంబర్‌ను కేటాయించకపోతే, మీ రిజిస్ట్రేషన్ నంబర్ పని చేస్తుంది. అయితే ఖాతా తెరిచిన ఆరు నెలల్లోగా ఆధార్ వివరాలను సమర్పించకపోతే ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి స్మాల్ సేవింగ్స్ యోజన ఖాతా మూసివేయబడుతుందని కేంద్రం తెలిపింది.

ఇవి కూడా చదవండి

పొదుపు ఖాతా తెరిచేటప్పుడు పాన్ నంబర్‌ను అందించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఖాతా తెరిచే సమయంలో ఈ రెండు పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. అలాగే అది కూడా రెండు నెలల్లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో మొత్తం క్రెడిట్‌ల మొత్తం 1 లక్ష కంటే ఎక్కువ ఉంటే పాన్ వివరాలను సమర్పించడం అవసరం. సబ్‌స్క్రైబర్ నిర్ణీత వ్యవధిలోగా పాన్ వివరాలను సమర్పించకపోతే, పాన్ నంబర్ అందించే వరకు ఖాతా పనిచేయదని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!