Social Media Fraud: సోషల్‌ మీడియాలో ఇలాంటి లింక్‌లను క్లిక్‌ చేస్తున్నారా? మీ డబ్బు మొత్తం పోయినట్టే!

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. బ్యాంకుల నుంచి అంటూ ఫోన్లు చేస్తూ క్షణాల్లో బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును మాయం చేస్తున్నారు నేరగాళ్లు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదేపదే సూచిస్తున్నా.. ఇంకా ..

Social Media Fraud: సోషల్‌ మీడియాలో ఇలాంటి లింక్‌లను క్లిక్‌ చేస్తున్నారా? మీ డబ్బు మొత్తం పోయినట్టే!
Socila Media Fraud
Follow us
Subhash Goud

|

Updated on: Apr 02, 2023 | 7:40 PM

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. బ్యాంకుల నుంచి అంటూ ఫోన్లు చేస్తూ క్షణాల్లో బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును మాయం చేస్తున్నారు నేరగాళ్లు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదేపదే సూచిస్తున్నా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సోషల్‌ మీడియాలో కనిపించే లింక్‌లను క్లిక్‌ చేయడం వల్ల మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడిపోతున్నారు. లేనిపోని లింక్‌లను క్లిక్‌ చేయడం వల్ల సైబర్‌ నేరగాళ్లు ఉచ్చులో పడి దారుణంగా మోసపోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఓ వ్యక్తి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎలా మోసపోయాడో తెలుసుకుందాం. నలుగురు స్నేహితులు తమ ఆఫీసులో మాట్లాడుకుంటున్నారు. వారిలో వివేక్ ఆందోళనగా కనిపిస్తున్నాడు. అతను ఆత్రుతగా తన ఫోన్ వైపు చూస్తూ తల తడుముకుంటున్నాడు అప్పుడు అతని స్నేహితుడు సునీల్ ఏం జరిగింది.. ఎందుకంత ఆందోళన చెందుతున్నావని అతన్ని అడిగాడు. ఏమి చెప్పమంటావు భయ్యా.. నేను మోసాయపోయాను అంటూ దిగులుగా చెప్పాడు వివేక్‌. అసలేం జరిగిందో వివరంగా చెప్పు అంటూ సునీల్‌ అడిగాడు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని బదులిచ్చాడు వివేక్‌.

వివేక్ తన ల్యాప్‌టాప్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. కార్తీక్ ఏమి చేస్తున్నావని ప్రశ్నించాడు వివేక్‌ను. తాను స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేశానని చెప్పాడు. దానికోసం పేమెంట్ చేశానని చెప్పాడు. అయితే పేమెంట్ ఫెయిల్ అయిందని మెసేజ్ వచ్చింది. బ్యాంక్ నుంచి డబ్బు డెబిట్ అయిపోయిందని చెప్పాడు వివేక్. దానికి కార్తీక్ పేమెంట్ డబ్బు రెండురోజుల్లో వాపసు అయిపోతుంది టెన్షన్ వద్దు అని చెప్పాడు.

రెండు రోజుల తర్వాత వివేక్ ఇంకా ఆందోళనలోనే ఉండడం చూసిన కార్తీక్ మళ్ళీ ఏమైందని అడిగాడు. వివేక్ మొన్న చేసిన స్మార్ట్‌ఫోన్ ఆర్డర్, డబ్బు ఇంకా రీఫండ్ కాలేదు అని చెప్పాడు. దానికి కార్తీక్ అందులో పెద్ద విషయం ఏమిటి? నీ బ్యాంక్ ట్విట్టర్ హ్యాండిల్‌పై ఫిర్యాదు చేయి అని వివేక్‌కు సలహా ఇచ్చాడు. ఇది మంచి ఆలోచనగా భావించిన వివేక్ ఆ ప్రక్రియ మొదలు పెట్టాడు.

ఇవి కూడా చదవండి

వివేక్ ఫోన్ మోగింది. అటునుంచి మాట్లాడుతున్నది వివేకేనా అంటూ అడిగారు. అవును అని చెప్పాడు వివేక్. ఫోన్ చేసిన వ్యక్తి తనని తాను యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి స్వాతి అని పరిచయం చేసుకుంది. ఇప్పుడు ఏమి చేయాలి అని వివేక్ ప్రశ్నించాడు. బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళి సమస్య పరిష్కరించుకోవాలని స్వాతి చెప్పింది. అంతేకాకుండా ఫోన్ లో కూడా ఈ పని చేయవచ్చని సలహా ఇచ్చింది. ఫోన్ ద్వారా సమస్య ఎలా పరిష్కరించుకోవాలని ఆమెను అడిగాడు వివేక్. దీంతో వివేక్ అభ్యర్థనను ప్రాసెస్ చేస్తున్నట్లు చెప్పింది. ఆమె వివేక్‌ని ఆన్‌లైన్‌లో ఉండమని అడుగింది. వెరిఫికేషన్ కోసం ఒక లింక్ వస్తుందని చెప్పింది స్వాతి. ఆ లింక్‌ను ఒకసారి ఓపెన్‌ చేయమని చెప్పింది. వివేక్‌ వెంటనే ఆ లింక్‌ను క్లిక్‌ చేశాడు. అంతే.. దెబ్బతో అతని ఖాతాలో ఉన్న డబ్బంత ఖాళీ అయిపోయింది. అంటే అతని ఎకౌంట్ లో ఉన్న డబ్బంతా వేరే అకౌంట్‌కు బదిలీ అయిపోయింది.

వివేక్ ఇప్పుడు ఇంకేం చెప్పగలడు? అతని ఎకౌంట్ లో ఉండాల్సిన బ్యాలెన్స్ మొత్తం పోయింది. ఏమి చేయాలో తెలియక నలుగురితో కలిసి తలపట్టుకుని కూచోవల్సి వచ్చింది. ఇలాంటి మోసానికి వివేక్ ఒక్కడే కాదు.. చాలా మంది బలవుతున్నారు. ఈ రోజుల్లో ట్విట్టర్‌లో ఇటువంటి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక్కడ బ్యాంకులు, బీమా, ఈపీఎఫ్‌ మోసాలకు సంబంధించిన మోసాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి మోసగాళ్లు ఉచ్చులో పడి ఎందరో నిలువునా మోసపోతున్నారు.

అంతే కాదు, ట్విట్టర్‌లో వివిధ బ్యాంకుల నకిలీ ఎకౌంట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఒరిజినల్ హ్యాండిల్స్‌ను పోలి ఉంటాయి. బ్యాంకులకు ఫిర్యాదులు చేసినప్పుడు, Twitter ఒక హ్యాండిల్‌ను మూసివేస్తుంది. అలాగే నాలుగు కొత్త ఎకౌంట్స్ ఓపెన్‌ అవుతాయి. వాస్తవానికి సైబర్ మోసంతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశను అందించడం ద్వారా బాధితుల నుంచి ఇలాంటి వివరాలు దొరకపుచ్చుకోవడం ద్వారా మోసగాళ్లు తమ పనిని సులువుగా చేసేసుకుంటున్నారు.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వివేక్ ఎలాంటి ఐడి, పాస్‌వర్డ్‌ను షేర్ చేయకపోతే, అతని బ్యాంక్ అకౌంట్ నుంచి 80,000 రూపాయలు ఎలా బదిలీ అయ్యాయి? వాస్తవానికి, సైబర్ దుండగులు మీ బ్యాంక్ ఖాతాకు లింక్ ద్వారా యాక్సెస్ పొందుతారు. దీని ద్వారా వారికి అన్ని రకాల రహస్య సమాచారం అందుతుంది. వివేక్ విషయంలోనూ అదే జరిగింది. మోసానికి బలి అయ్యాడు. ఇప్పుడు, అతను ఏమి చేయాలి? అతను తన డబ్బును తిరిగి పొందగలడా?

ఈ మొత్తం కేసులో వివేక్ చేసిన అతిపెద్ద తప్పు ఏమిటి? నెట్ బ్యాంకింగ్ లావాదేవీల వైఫల్యం వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌ అయిన డబ్బు రెండు, మూడు రోజుల్లో క్రెడిట్‌ అవుతాయి. ఓపికగా ఉండటం, రీఫండ్ సైకిల్ పూర్తయ్యే వరకు వేచి ఉండటం ముఖ్యం. డబ్బు జమ కాకపోతే, బ్యాంక్ రిజిస్టర్డ్ కస్టమర్ కేర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ కావడానికి ఏదైనా లింక్‌పై క్లిక్ చేయడం లేదా OTPని షేర్ చేయడం అవసరం లేదని అర్థం చేసుకోండి. లింక్‌పై క్లిక్ చేయడం అతిపెద్ద తప్పు. ఎవరైనా మీకు లింక్‌ని పంపి, దానిపై క్లిక్ చేయమని మిమ్మల్ని అడగడం, లేదా OTP చెప్పాలని అడిగితే అప్రమత్తం ఉండండి. ఈ వివరాలు చెప్పినట్లయితే మీరు స్కామ్‌కు గురైనట్లే. ఒక చిన్న పొరపాటే మిమ్మల్ని మోసపోయేలా చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కదా గుడ్‌ న్యూస్‌ అంటే.. రూ. 39 వేలకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
ఇది కదా గుడ్‌ న్యూస్‌ అంటే.. రూ. 39 వేలకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వీరేనా ఆరెంజ్ ఆర్మీ వీరులు? ప్రత్యర్థులల్లో దడ పుట్టించే SRH టీమ్
వీరేనా ఆరెంజ్ ఆర్మీ వీరులు? ప్రత్యర్థులల్లో దడ పుట్టించే SRH టీమ్
నిమ్మకాయతో ఇలా చేస్తే ఇంట్లోకి అస్సలు దోమలే రావు..
నిమ్మకాయతో ఇలా చేస్తే ఇంట్లోకి అస్సలు దోమలే రావు..
టీమిండియా లెజెండరీ ప్లేయర్ కెరీర్ కాపాడిన ఐపీఎల్.. ఎందుకో తెలుసా?
టీమిండియా లెజెండరీ ప్లేయర్ కెరీర్ కాపాడిన ఐపీఎల్.. ఎందుకో తెలుసా?
దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!
దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.