Mahila Samman Savings Scheme: మోడీ సర్కార్ గుడ్‌న్యూస్.. మహిళల కోసం అద్బుతమైన ప్రత్యేక సేవింగ్స్ స్కీమ్.. పూర్తి వివరాలు
మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌ను జోడించింది. ఇందులో మహిళలు మాత్రమే పెట్టుబడి..
మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌ను జోడించింది. ఇందులో మహిళలు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్రభుత్వ పథకం తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని అందిస్తుంది.
బడ్జెట్ 2023లో ప్రకటన తర్వాత.. ఈ పథకం నోటిఫికేషన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేయబడింది. అంటే ఇప్పుడు మీరు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. కేవలం 2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్‌పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది.
మహిళా సమ్మాన్ పొదుపు పథకం ప్రయోజనాలు:
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం కింద మహిళలు లేదా సంరక్షకులు మాత్రమే మైనర్ పేరుతో ఖాతాను తెరవగలరు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండేండ్ల వరకు అంటే 2025 మార్చి వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఇందులో కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు. ఈ పథకం కింద వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
ఈ ప్లాన్ కింద ఖాతాను మూసివేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. అయితే, ఖాతాదారుడు మరణిస్తే దాన్ని మూసివేయవచ్చు. ఇది కాకుండా ఇతర పరిస్థితులలో, ప్రభుత్వం అంగీకరిస్తే, అప్పుడు ఖాతాను మూసివేయవచ్చు. ప్రీమెచ్యూర్ ఖాతాను 6 నెలల తర్వాత మాత్రమే మూసివేయవచ్చు. డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే అందులో ఫారం-2 నింపాలి. మైనర్‌లు ఫారం-3ని పూరించగలరు. 1 సంవత్సరం తర్వాత, 40% మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఒక మహిళ ఈ పథకంలో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే, ఆమెకు 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ఈ మొత్తాన్ని 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ మొత్తం మూడు నెలల తర్వాత ఖాతాలో వేస్తారు. దీని ప్రకారం రెండేళ్లలో మహిళలకు రూ.2.32 లక్షలు జమ చేస్తారు. ఇప్పటికైతే ఈ పథకం పోస్టాఫీసులకే పరిమితం చేశారు. బ్యాంకుల్లో ఎప్పటి నుంచి అమలవుతుందో తెలియాల్సి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి