NRI Property: ఎన్నారై నుంచి ఆస్తిని కొనుగోలు చేస్తే ఎలాంటి టాక్స్ నియమాలు ఉంటాయి?

ఇల్లు కొనడం అనేది కోట్లాది మందికి కల. ఈ ద్రవ్యోల్బణ కాలంలో మీకు మంచి ధరలో ఇల్లు లభిస్తే అది చాలా మంచి డీల్. కొంత మంది ఎన్నారైల నుంచి ఇల్లు, ఇతర ఆస్తులను కొనుగోలు చేస్తుంటారు. అలాంటి సమయంలో ఆదాయపు పన్నుకు సంబంధిన..

NRI Property: ఎన్నారై నుంచి ఆస్తిని కొనుగోలు చేస్తే ఎలాంటి టాక్స్ నియమాలు ఉంటాయి?
Nri Property Tax Rules
Follow us
Subhash Goud

|

Updated on: Apr 02, 2023 | 7:03 PM

ఇల్లు కొనడం అనేది కోట్లాది మందికి కల. ఈ ద్రవ్యోల్బణ కాలంలో మీకు మంచి ధరలో ఇల్లు లభిస్తే అది చాలా మంచి డీల్. కొంత మంది ఎన్నారైల నుంచి ఇల్లు, ఇతర ఆస్తులను కొనుగోలు చేస్తుంటారు. అలాంటి సమయంలో ఆదాయపు పన్నుకు సంబంధిన విషయాలు తెలిసి ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో ఎంతో మంది చాలాసార్లు తప్పులు చేస్తుంటారు. అందుకే ఎన్నారై (NRI) ఆస్తిని విక్రయించినప్పుడు పన్ను ఎలా లెక్కిస్తారో చూద్దాం. నివాసి కొనుగోలుదారు ఒక ఎన్నారై నుంచి ఇల్లు కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో చూద్దాం.

మీరు ఆస్తిని విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై పన్ను ఉంటుంది. అది స్థానిక నివాసి అయినా లేదా ఎన్నారై అయినా ఈ పన్ను హోల్డింగ్ వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. మీరు 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు ఇంటిని కలిగి ఉన్న తర్వాత దానిని విక్రయిస్తే, లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ ఉంటుంది. అయితే హోల్డింగ్ వ్యవధి 2 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, షార్ట్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ ఉంటుంది. ఒక ఎన్‌ఆర్‌ఐ తన తల్లిదండ్రులు లేదా తాతాల నుంచి వారసత్వంగా ఇంటిని పొందినట్లయితే, అప్పుడు కూడా పన్ను ఉంటుంది.

ఇంటి అమ్మకంపై షార్ట్‌ టర్మ్‌ గెయిన్‌ ఉన్నట్లయితే, భారతదేశంలోని ఎన్నారై మొత్తం ఆదాయానికి క్యాపిటల్‌ గేయిన్‌ కలుపుతారు. అలాగే ఎన్నారై పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. దీర్ఘకాలిక మూలధన లాభంపై ఉన్నప్పుడు, ఇండెక్సేషన్ ప్రయోజనం తర్వాత 20% పన్ను ఉంటుంది. రెండు సందర్భాల్లో సర్‌ఛార్జ్, సెస్ భిన్నంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

స్థానిక ప్రజల మాదిరిగానే ఎన్నారైలు కూడా తమ పాత ఇంటిని విక్రయించడం ద్వారా కొత్త ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ను ఆదా చేయవచ్చు. దీని కోసం మీరు పూర్తి లాభంతో ఇంటిని కొనుగోలు చేయాలి. కొత్త ఇల్లు అమ్మిన తేదీ నుంచి 2 సంవత్సరాలలోపు కొనుగోలు చేయాలి. అయితే దీని నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి కావాలి. అమ్మకానికి ఒక సంవత్సరం ముందు కూడా మీరు ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. సెక్షన్ 54 ప్రకారం.. FY 2023-24 నుంచి రూ. 10 కోట్ల వరకు మూలధన లాభంపై మాత్రమే పన్ను మినహాయింపు అందుబాటులో ఉంటుంది. అంతకంటే ఎక్కువ లాభాలు ఉన్నట్లయితే ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే, ఎన్నారైలు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీఎల్‌), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీఎల్‌) వంటి ఆప్షన్‌ చేసిన బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా సెక్షన్ 54EC కింద పన్ను ఆదా చేయవచ్చు. గరిష్ట పెట్టుబడి 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఆస్తి బదిలీ అయిన 6 నెలల్లోపు బాండ్లను కొనుగోలు చేయాలి.

స్థానిక ప్రజలకు ఎన్నారైలకు క్యాపిటల్‌గెయిన్స్‌ ట్యాక్స్‌, పొదుపు నియమాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే వారి నుంచి ఆస్తిని కొనుగోలు చేసే స్థానిక వ్యక్తి విక్రయ ధర నుంచి టీడీఎస్‌ని తీసివేసిన తర్వాత చెల్లించాలి. లాంగ్‌టర్మ్‌ గెయిన్స్‌పై టీడీఎస్‌ 20% అయితే షార్ట్‌టైమ్‌ క్యాపిటల్‌ గేయిన్‌ పై 30%. పన్ను మినహాయింపులకు పరిమితి లేదు. దీనికి విరుద్ధంగా విక్రయం మొత్తం 50 లక్షల కంటే ఎక్కువ ఉన్నట్లయితే స్థానిక వ్యక్తి నుంచి ఆస్తిని కొనుగోలు చేయడంపై కేవలం 1% టీడీఎస్‌ మాత్రమే ఉంటుంది.

ఎన్నారై నుంచి స్థానికుడు ఆస్తిని కొనుగోలు చేయడానికి కొన్ని నియమాలు తప్పనిసరి. అటువంటి కొనుగోలుదారులు టీడీఎస్‌ని తీసివేయడానికి పన్ను మినహాయింపు, కలెక్షన్ అకౌంట్‌ నంబర్‌ పొందవలసి ఉంటుంది. టీడీఎస్‌ తీసివేసిన నెలాఖరు నుంచి 7 రోజులలోపు ఆదాయపు పన్ను శాఖలో జమ చేయాలి. టీడీఎస్‌ని ఆన్‌లైన్‌లో లేదా చలాన్ ద్వారా డిపాజిట్ చేయవచ్చు. పన్ను దాఖలు చేసిన తర్వాత, కొనుగోలుదారు ఫారమ్ 27Qని పూరించి, టీడీఎస్‌ని ఫైల్ చేయాలి. చివరగా, కొనుగోలుదారుకు ఆస్తిని విక్రయించే ఎన్‌ఆర్‌ఐ ఫారమ్ నంబర్ 16A అంటే TDS సర్టిఫికేట్ ఇవ్వాలి.

ఎన్నారై విక్రేత తాను మినహాయించే టీడీఎస్‌ మొత్తానికి పన్ను విధించబడదని భావిస్తే, అతను తక్కువ తగ్గింపు సర్టిఫికేట్ లేదా నిల్ డిడక్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ జురిస్డిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్‌కి దరఖాస్తు ఇవ్వాలి. దీని కోసం మీరు ఫారమ్ 13 నింపాలి. ఎన్నారై భారతదేశంలో తన మొత్తం ఆదాయాలను మూలధన లాభాలతో పాటు లెక్కించాలి. అలాగే, సేల్ అగ్రిమెంట్ కాపీని సమర్పించాలి. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అధికారి తక్కువ తగ్గింపు సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత దాని ప్రకారం.. టీడీఎస్‌ తీసివేయబడుతుంది.

మీరు కూడా ఎన్‌ఆర్‌ఐ నుంచి ఇంటిని కొనుగోలు చేస్తుంటే టీడీఎస్‌ తీసివేయకుండా ఎలాంటి చెల్లింపు చేయకండి. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. స్థానిక నివాసి నుంచి కొనుగోలు చేయడం కంటే ఎన్నారై నుంచి ఆస్తిని కొనుగోలు చేయడం చాలా క్లిష్టంగా ఉంటుంది. దీని కోసం మీరు చార్టర్డ్ అకౌంటెంట్ సహాయం తీసుకోవచ్చు. ఎన్‌ఆర్‌ఐకి ఎక్కువ టీడీఎస్‌ తీసివేయబడితే అతను ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడం ద్వారా వాపసును క్లెయిమ్ చేయవచ్చు. మొత్తం పన్ను బాధ్యతలో టీడీఎస్‌ సర్దుబాటు చేసిన తర్వాత మిగిలి ఉన్న మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖ ఎన్‌ఆర్‌ఐకి రీఫండ్ చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!