AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: మెరిసే చర్మం మీ సొంత కావాలంటే.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయిపోండి..

చాలా మంది చర్మ సౌందర్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది మాత్రం స్కిన్ ప్రొటక్షన్ పై ఎటువంటి శ్రద్ధ తీసుకోరు. బయటకు వెళ్లినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ తీసుకున్న దాని ప్రభావం ఫస్ట్ స్కిన్​ మీదే పడుతుంది. అది చర్మాన్ని..

Skin Care Tips: మెరిసే చర్మం మీ సొంత కావాలంటే.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయిపోండి..
Glowing Skin
Amarnadh Daneti
|

Updated on: Sep 06, 2022 | 10:19 PM

Share

Skin Care Tips: చాలా మంది చర్మ సౌందర్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది మాత్రం స్కిన్ ప్రొటక్షన్ పై ఎటువంటి శ్రద్ధ తీసుకోరు. బయటకు వెళ్లినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ తీసుకున్న దాని ప్రభావం ఫస్ట్ స్కిన్​ మీదే పడుతుంది. అది చర్మాన్ని నల్లగా చేస్తుంది. అంతే కాకుండా స్కిన్ నిర్జీవంగా కనిపించేలా చేస్తుంది. కొన్ని సింపుల్ ట్రిక్స్ తో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల లేదా ట్రాఫిక్ కాలుష్యం వల్ల హైపర్పిగ్మెంటేషన్, సన్ టాన్ ఏర్పడుతుంది. పైగా ఈ వర్షాకాలంలో కూడా వేడి ఎక్కువగానే ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల చర్మం ముదురు రంగులో మారే అవకాశముంది. అధిక సూర్యరశ్మి వలన హైపర్పిగ్మెంటేషన్, సన్బర్న్, డార్క్ స్పాట్స్ ఏర్పడవచ్చని సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

నిమ్మ, తేనె: ఒక టేబుల్ స్పూన్ తేనెతో తాజా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి.. 20 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో లేదా చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే టాన్ తొలగిపోతుంది.

శెనగపిండి: శెనగపిండి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయం చేస్తుంది. శెనగపిండి, పసుపు, పెరుగు వేసి బాగా కలపాలి. దానిని ఒక మృదువైన పేస్ట్ గా తయారుచేయాలి. దానిని మీ చర్మంపై అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి.. ఆపై దానిని కడగాలి. ఈ చిట్కాను చాలామంది ఎప్పటినుంచో వినియోగిస్తున్నారు. ఫలితాలు కూడా సానుకూలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

పండ్లు, కూరగాయలు: పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

కొబ్బరి పాలు: కొబ్బరి పాలలో దూదిని నానబెట్టాలి. దానిని 15 నిమిషాలు అలాగే ఉంచి.. అనంతరం దానితో శరీరాన్ని లేదా టాన్ ఉన్న ప్రదేశాన్ని ప్యాక్ చేసి.. తర్వాత దానిని చల్లని నీటితో కడగాలి. కొబ్బరి పాలు టాన్ రిమూవ్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా చర్మానికి మంచి రక్షణ, పోషణ అందిస్తాయి. అందుకే చాలా బ్యూటీ ప్రొడెక్ట్స్​లో కొబ్బరిపాలు ఉపయోగిస్తారు.

కలబంద: అలోవెరా జెల్ తీసుకుని చర్మానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. కలబంద గుజ్జులో పసుపు కలిపి రాసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..