Cooking Tips: తక్కువ నూనెతో కూడా టెస్టీ వంటకాలు.. ఇలా చేస్తే రుచితో పాటు ఎన్నో లాభాలు..
చాలా మంది పులుసు కూరలకంటే కూడా వేపుడు కూరలంటే చాలా ఇష్టం.. మరికొంతమందికి ఆయిల్ ఫుడ్స్ అసలు ఇష్టం ఉండదు. నూనె లేకుండా వండితే కొన్ని కూరలు అసలు బాగుండవని కొందరు అభిప్రాయపడుతుంటారు. కాని తక్కువ నైనెతో కూడా టెస్టీ వంటకాలు చేసుకోవచ్చు..

Cooking Tips: చాలా మంది పులుసు కూరలకంటే కూడా వేపుడు కూరలంటే చాలా ఇష్టం.. మరికొంతమందికి ఆయిల్ ఫుడ్స్ అసలు ఇష్టం ఉండదు. నూనె లేకుండా వండితే కొన్ని కూరలు అసలు బాగుండవని కొందరు అభిప్రాయపడుతుంటారు. కాని తక్కువ నైనెతో కూడా టెస్టీ వంటకాలు చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. చాలా మంది ఎక్కువగా నూనెలో ఫ్రై చేసిన ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు. కొందరు వంటల్లో కూడా ఎక్కువ నూనె వేసి చేసేస్తుంటారు. అయితే నూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా అనర్థాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. నూనెను తక్కువ తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. వంట చేసేటప్పుడు నూనె, మసాలాలు ఎక్కువగా వాడితేనే వంట ఉంటుందనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ.. తక్కువ నూనెతో కూడా రుచికరమైన వంట చేసుకోవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా నూనె వాడకం తగ్గించాలని సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలు పాటిస్తే తక్కువ నూనెతో కూడా టేస్టీగా వంటలు చేసుకోవచ్చు. అవెంటో తెలుసుకుందాం.
పాత్రల ఎంపిక: తక్కువ నూనెతో టేస్టీ ఫుడ్ తినాలనుకుంటే.. మొదట సరైన పాత్రను ఎంచుకోవాలి. ఐరన్ లేదా నాన్ స్టిక్ పాన్ ఉపయోగిస్తే మంచిది. స్టవ్ వెలిగించి.. పాత్రను పెట్టి వేడిచేయాలి. తర్వాత దానిలో నూనె వేయాలి. ఆయిల్ బ్రష్ సహాయంతో నూనెను పాత్ర అంతటా విస్తరించాలి. ఇప్పుడు నూనె వేడి కాగానే వంట పదార్థాలను దానిలో వేసుకోవాలి.
మాంసహార వంటకాలకు: తక్కువ నూనెలో మాంసాహార వంటకాలు వండడానికి ఉత్తమ మార్గం అన్ని పదార్థాలను ముందే కలిపి ఉంచుకోవాలి. మెరినేషన్ సమయంలో పెరుగు ఉపయోగించాలి. బాణలిలో 1 నుంచి 2 స్పూన్ల నూనెను వేడి చేసి.. మసాలా దినుసులన్నీ వేయాలి. అప్పుడు మెరినేట్ మిశ్రమాన్ని వేయాలి. దీనివల్ల మాంసం పాన్కు అంటుకోదు. ఎక్కువ నూనె లేకుండా టేస్టీ మాంసం కూరను తినొచ్చు.




తక్కువ నూనెతో వండడం వల్ల ఆహారం పాన్ అడుగున అంటుకునే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీరు వేడిని చాలా తక్కువగా ఉంచాలి. మంటను స్లోగా ఉంచితే.. వంట బాగా ఉడుకుతుంది. రుచి ఎక్కువగా ఉంటుంది. అడుగు పట్టదు. నూనె తక్కువగా ఉంటే.. మసాలాలు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాంటప్పుడు కొన్ని నీళ్లు వేసి.. మూతపెట్టి దానిని ఉడికించాలి. లేదా మూతపై నీరు పోసి.. స్టవ్ కాస్త సిమ్లో ఉంచి ఉడికించాలి. అలాచేస్తే బాగా ఉడుకుతుంది. ఇలా చిన్ని చిన్ని చిట్కాలు పాటించడం ద్వారా తక్కువ నూనెతో టెస్టీ వంటకాలు వండుకుని తినవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..



