AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apricot Side Effects: సీజన్ వచ్చేసింది కదా అని ఆప్రికాట్ పండ్లను అతిగా తింటున్నారా..? అయితే ఈ విషయాలను తెలుసుకోండి..

వేసవి సీజన్‌లో లభించే ఆప్రికాట్ పండు కూడా మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పండులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్..

Apricot Side Effects: సీజన్ వచ్చేసింది కదా అని ఆప్రికాట్ పండ్లను అతిగా తింటున్నారా..? అయితే ఈ విషయాలను తెలుసుకోండి..
Apricot Side Effects
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 07, 2023 | 8:45 AM

Share

మార్చి నెల నుంచే వేసవి ఎండలు వచ్చేశాయి. మండుతున్న ఈ ఎండలో మన శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే పండ్లు తీసుకోవడంతో పాటు సీజనల్ పండ్లు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ పండ్లలో లభించే పోషకాలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కల్పించేవిగా ఉంటాయి. ఆ క్రమంలోనే వేసవి సీజన్‌లో లభించే ఆప్రికాట్ పండు కూడా మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పండులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్, ఇతర కెరొటీనాయిడ్స్ వంటి పలు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మాక్యులర్ డిజేనరేషన్, కంటి శుక్లం వంటి వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఆప్రికాట్లు అద్భుతంగా పని చేస్తాయి. పురాతన కాలంలో రోమన్లు ఈ పండ్లు కనుగొన్నారు. ఇంకా ఆప్రికాట్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, కెరొటీనాయిడ్లు, అస్పోలిఫెనాల్స్ వంటి వివిధ ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఇవి వాటికి మంచి రంగు, రుచి, పోషక విలువలు అందిస్తాయి.

అందుకే వీటిని తాజాగా తినడమే కాక, డ్రై ఫ్రూట్స్‌గా కూడా తింటారు. ఇవి వంటల రుచిని సైతం పెంచుతాయి. విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒక కప్పు ఎండిన ఆప్రికాట్‌లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు దోహదపడుతుంది. ఇందులోని కాల్షియం ఎముకలు బలంగా మారేందుకు సహకరిస్తుంది. ఐరన్ ఉండటం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. రక్తహీనత సమస్యల నుంచి బయట పడేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇతర ఆహార పదార్థాల మాదిరిగానే దీన్ని కూడా మితంగా తీసుకోవాలి. లేదంటే పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

జీర్ణ సమస్యలు: ఆప్రికాట్లు ఫైబర్ తో నిండి ఉంటాయి. శరీరానికి ఫైబర్ ఎంతో అవసరమైన ఖనిజం. పేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే అధికంగా ఫైబర్ తీసుకుంటే అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆప్రికాట్లు ఎక్కువగా తింటే కడుపు చికాకు పెడుతుంది. తిమ్మిరి, ఉబ్బరం, కడుపు నొప్పి, మలబద్ధకం, విరోచనాలకు కారణంఅవుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు: అమితంగా వీటిని తింటే అనారోగ్యకరమైన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దాని వల్ల ఊబకాయం సమస్య ఏర్పడుతుంది.

తలనొప్పి: ఆప్రికాట్ గింజల్లో అమిగ్డాలిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. దీన్ని అతిగా తీసుకుంటే సైనేడ్ గా మారుతుంది. ఫలితంగా వికారం, తలనొప్పి, విపరీతమైన దాహం, నీరసం, ఆందోళన, జ్వరం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి. రక్తపోటు స్థాయిలు పడిపోతాయి.

అలర్జీలు: అలర్జీలతో బాధపడే వాళ్ళు వీటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎండబెట్టిన ఆప్రికాట్లు సల్ఫైట్ లను కలిగి ఉంటుంది. ఇవి ఆస్తమాని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఉబ్బసం బారిన పడే ప్రమాదం ఉంది.

రోజుకి ఎన్ని తినాలి?

యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం ప్రతిరోజు 1-2 కప్పుల ఆప్రికాట్ పండ్లని తినాలి. 30 గ్రాములు ఉండే ఒక  పండు లేదా 3-4 ఎండిన ఆప్రికాట్లు తీసుకుంటే సరిపోతుంది. రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యమైన ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..