AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Hall Tickets: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్స్ విడుదల.. డౌన్‌లోడ్, షెడ్యూల్ పూర్తి వివరాలివే..

సోమవారం తెలంగాణ ఇంట‌ర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల హాల్ టికెట్లను అప్‌లోడ్ చేసిన‌ట్లు బోర్డు అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే

TS Inter Hall Tickets: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్స్ విడుదల.. డౌన్‌లోడ్, షెడ్యూల్ పూర్తి వివరాలివే..
Ts Inter Hall Tickets 2023
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 07, 2023 | 6:45 AM

Share

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం తెలంగాణ ఇంట‌ర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల హాల్ టికెట్లను అప్‌లోడ్ చేసిన‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని, హాల్ టికెట్‌లో ఫోటో, సంతకం, పేరు, సబ్జెక్ట్ తదితర విషయాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్, లేదా బోర్డుకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్‌పై కాలేజీ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు.

హాల్ టికెట్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

Step 1:  ముందుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/‌ను సంద‌ర్శించాలి.

ఇవి కూడా చదవండి

Step 2:  అనంత‌రం TSBIE IPE 2023 Inter Hall Tickets లింక్‌పై క్లిక్ చేయాలి.

Step 3:  తర్వాత  https://tsbieht.cgg.gov.in/IPE2023FirstYrHallTickets.do లింక్ ఓపెన్ అవుతుంది. (లింక్ ఇంకా యాక్టివేట్ కాలేదు.)

Step 4:  అవ‌స‌ర‌మైన వివరాలను న‌మోదు చేసి స‌బ్మిట్ అవ్వాలి.

Step 5:  హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోగానే.. విద్యార్థులు ముందుగా పూర్తిగా వ్య‌క్తిగ‌త వివ‌రాలు స‌రిచూసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, కాలేజీ పేరు, స‌బ్జెక్టుల వివ‌రాలు స‌రిగా ఉన్నాయో లేదా అని చూసుకోవాలి. అక్ష‌ర దోషాలు ఉంటే గుర్తించాలి. వివ‌రాలు అన్ని స‌రిగ్గా ఉన్నాయ‌ని నిర్ధారించుకోవాలి. లేకుంటే త‌ప్పిదాన్ని కాలేజీ ప్రిన్సిపాల్, లేదా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలి.

పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే.. 

మార్చి 15 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు:

మార్చి 15-సెకండ్ ల్యాంగ్వేజ్ పేపర్

మార్చి 17-ఇంగ్లీష్ పేపర్

మార్చి 20-మ్యాథ్స్ పేపర్ 1ఏ/ బోటనీ/ పొలిటికల్ సైన్స్

మార్చి 23-మ్యాథ్స్ పేపర్ 1బీ/జూవాలజీ/ హిస్టరీ

మార్చి 25-పిజిక్స్/ ఎకనామిక్స్

మార్చి 28-కెమిస్ట్రీ/ కామర్స్

మార్చి 31-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్‌)

ఏప్రిల్ 03-మోడ్రన్ ల్యాంగ్వేజ్/ జియోగ్రఫీ

మార్చి 16 నుంచి ఇంటర్ సెకండియర్‌ పరీక్షలు: 

మార్చి 16-సెకండ్ ల్యాంగ్వేజ్

మార్చి 18-ఇంగ్లీష్

మార్చి 21-మ్యాథ్స్ పేపర్ 2ఏ/ బోటనీ/ పొలిటికల్ సైన్స్

మార్చి 24-మ్యాథ్స్ పేపర్ 2బీ/జువాలజీ/ హిస్టరీ

మార్చి 27-ఫిజిక్స్/ ఎకనామిక్స్

మార్చి 29-కెమిస్ట్రీ / కామర్స్

ఏప్రిల్ 01-పబ్లిక్ అడ్మినిస్టరేషన్ పేపర్ 2/ బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ 2( బైపీసీ స్టూడెంట్స్)

ఏప్రిల్ 04-మోడ్రన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2/ జియోగ్రఫీ

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us