Women’s Day: తెలంగాణ ఆడబిడ్డలకు కానుక.. వడ్డీ లేని రుణాల నిధులను విడుదల చేసిన సర్కార్..

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకి కానుకను అందించనున్నది. 750 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..

Women’s Day: తెలంగాణ ఆడబిడ్డలకు కానుక.. వడ్డీ లేని రుణాల నిధులను విడుదల చేసిన సర్కార్..
Interest Free Loans To Women In Telangana
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 07, 2023 | 6:10 AM

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకి కానుకను అందించనున్నది. 750 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు భారీ ఎత్తున వడ్డీ లేని రుణాలు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఈ రోజు(మార్చి 6) 250 కోట్ల రూపాయలను పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల కోసం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తరపున రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. రాష్ట్రంలోని 23 జిల్లాల పరిధిలో ఉన్న పురపాలక పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఈ నిధులు అందనున్నట్లు కేటీఆర్ తెలిపారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న వడ్డీ లేని రుణాల బకాయిలను మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు విడుదల చేయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలన్నీ సంఘాల్లోని సభ్యులు అత్యంత ఆర్థిక క్రమశిక్షణతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లిస్తున్నారని తెలిపిన కేటీఆర్, రీపేమెంట్ ఆఫ్ లోన్స్ విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో మన మహిళలు ఉన్నారన్నారు. అంతేకాక.. మహిళా దినోత్సవం రోజున 100 మహిళా ఆస్పత్రులను ప్రారంభిస్తామని, ప్రతి మంగళవారం మహిళ సమస్యల మీద మహిళా డాక్టర్లు వైద్యం చేస్తారని మంత్రి హరీశ్‌రావు తెలియజేశారు.

అదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలికల్లో 1. లక్షా 77 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, ఇందులో దాదాపు 18 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారని, వీరందరికీ ఈరోజు ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ లేని రుణాల నిధులు ఉపయుక్తంగా ఉంటాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఇప్పటిదాకా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు సుమారు 15,895 కోట్ల రూపాయలను రుణాల లింకేజీ రూపంలో అందించిందని కేటీఆర్ తెలిపారు. ఇంత భారీ రుణాల పైన వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రూపొందించిన వడ్డీ లేని రుణాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 370 కోట్ల రూపాయలను, దాదాపు 90,325 స్వయం సహాయక సంఘాలకు అందించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల నిధులను పెద్ద ఎత్తున విడుదల చేయడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల తరఫున ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

మహిళలకు అసలైన ఆత్మ బంధువు సీఎం కేసీఆర్ అని  రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మహిళలు ఎవరికీ తీసిపోరని కొనియాడుతూ.. తెలంగాణలో మహిళలకు స్థానిక సంస్థల్లో, మార్కెట్ కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ చరిత్రలో మొదటి సారిగా మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులను మహిళలకు కట్టబెట్టిన ఘటన సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ఇంకా మహిళలను ఆదుకునేందుకు సేవా గృహాలు, స్టేట్ హోమ్స్, రెస్క్యూ హోమ్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, వృద్ధాప్య గృహాలు, ప్రత్యేక పాలిటెక్నిక్, డిగ్రీ మహిళా రెసిడెన్షియల్ కాలేజీలు నిర్వహిస్తూ ఆడపిల్లలు, మహిళల సమగ్ర వికాసం, సంరక్షణ కోసం కృషి జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల భద్రతకు షీటీమ్స్, ఒంటరి, వృద్ధ, వితంతు, బీడి కార్మిక, బోధకాలు, నేత, గీత మహిళలకు పెన్షన్లు ఇస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామని వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ. లక్షా ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!