Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లు ఆడిస్తున్నారా? ఆ సమస్య ఉండొచ్చు.. జాగ్రత్తపడాలంటోన్న నిపుణులు

వణుకుతున్న కాళ్లకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అనేది కూడా ఒక కారణం కావచ్చు. ఇది ఎవరికైనా సంభవించవచ్చు. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్య. ఈ సమస్య పురుషులు, స్త్రీలలో సంభవిస్తుంది.

కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లు ఆడిస్తున్నారా? ఆ సమస్య ఉండొచ్చు.. జాగ్రత్తపడాలంటోన్న నిపుణులు
Legs
Follow us
Basha Shek

|

Updated on: Nov 16, 2022 | 8:53 AM

మనలో చాలామంది కుర్చీలో కూర్చున్నప్పుడు అదే పనిగా కాళ్లు ఊపడం లేదా ఆడించడం చేస్తుంటారు. కారణమడిగితే ఏమీ లేదంటారు. మరికొందరేమో తమ పనిపై పూర్తిగా మనసును లగ్నం చేసేందుకు ఇలా చేస్తున్నామంటారు. కేవలం కుర్చీలో కూర్చున్నప్పుడే కాదు మాములుగా కూర్చున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు తమ కాళ్లను ఆడిస్తుంటారు. చాలామంది ఇది ఓ సాధారణ అలవాటుగా భావిస్తారు. అయితే అది ఒక వ్యాధికి సంకేతం కూడా కావచ్చంటున్నారు నిపుణులు. మరి కూర్చున్నప్పుడు కాళ్లు వణకడానికి కారణమేమిటి? మరి ఈ అలవాటును దూరం చేసుకునే మార్గాలేంటో తెలుసుకుందాం రండి. వణుకుతున్న కాళ్లకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అనేది కూడా ఒక కారణం కావచ్చు.  ఇది ఎవరికైనా సంభవించవచ్చు. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్య. ఈ సమస్య పురుషులు, స్త్రీలలో సంభవిస్తుంది. అలాగే ఇది నిద్రలేమి సమస్యలకు ముందస్తు సంకేతం కావొచ్చు. కాబట్టి కాళ్లు వణుకుతున్న అలవాటును తేలికగా తీసుకోకండి.

రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అంటే ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్లలో ఆకస్మిక నొప్పి మొదలవుతుంది. ఈ సమయంలో కాళ్లను కాస్త కదిలించినప్పుడు ఈ నొప్పి తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ బాధాకరమైన పరిస్థితి పదేపదే సంభవించినప్పుడు, దానిని రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అంటారు. ఐరన్ లోపం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి మీకు కూడా తరచుగా కాళ్లు వణుకుతున్నట్లయితే నిర్లక్ష్యం చేయకండి. ఈ సిండ్రోమ్ ఖచ్చితమైన కారణాన్ని చెప్పడం కష్టం అయినప్పటికీ, కొన్నిసార్లు ఇది జన్యుపరమైన సమస్య కూడా కావచ్చు. ఇంట్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. తద్వారా ఇది పిల్లలలో కూడా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈ అలవాటును మానేయడానికి ప్రయత్నించండి. నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కాకుండా గర్భిణీలు, కిడ్నీ, పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న రోగులలో, డెలివరీ చివరి రోజులలో ఇటువంటి సమస్యలు సంభవిస్తాయి. రక్తపోటు, షుగర్ పేషెంట్లు, హృద్రోగులలో దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి చికిత్సకు సాధారణంగా ఐరన్ మాత్రలు సూచిస్తారు. అలాగే ఫిజియోథెరపీ చికిత్స తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..