Periods Back Pain: పీరియడ్స్ సమయంలో నడుము నొప్పి వేధిస్తోందా.. అయితే ఇలా చేయండి!
నెలసరి వస్తుందంటే చాలా మంది లేడీస్ భయ పడిపోతూ ఉంటారు. ఏ పని చేయ బుద్ధి కాదు.. ఎవరితోనూ మాట్లాడాలని కూడా ఉంటుంది. ఎందుకంటే కొంత మందిలో నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, నీరసంగా, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం ఇలా చాలా రకాల సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. కానీ పీరియడ్స్ రావడం వల్లనే మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. అయితే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యలు పోతాయి. ఇది ఆడవారి జీవితంలో..

నెలసరి వస్తుందంటే చాలా మంది లేడీస్ భయ పడిపోతూ ఉంటారు. ఏ పని చేయ బుద్ధి కాదు.. ఎవరితోనూ మాట్లాడాలని కూడా ఉంటుంది. ఎందుకంటే కొంత మందిలో నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, నీరసంగా, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం ఇలా చాలా రకాల సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. కానీ పీరియడ్స్ రావడం వల్లనే మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. అయితే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యలు పోతాయి. ఇది ఆడవారి జీవితంలో కీలక భాగం అని చెప్పవచ్చు. నెలసరి వచ్చినప్పుడు ముఖ్యంగా చాలా మంది లేడీస్ లో వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఈ వెన్ను నొప్పి ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పీరియడ్స్ లో వెన్ను నొప్పి ఎందుకు వస్తుంది:
పీరియడ్స్ టైమ్ లో శరీరం ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీని కారణంగా గర్భాశయం లైనింగ్ ను తొలగించడానికి గర్బాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది. ఈ సంకోచాల కారణంగా నడుము దగ్గర ఉన్న కండరాలు ప్రభావితం అవుతాయి. ఇలా పీరియడ్స్ లో వెన్ను నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుల్ని సంప్రదించడం మేలు.
వీటి కారణంగా కూడా నొప్పి వస్తుంది:
ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయంలోని కణజాలం. ఇది పెల్విక్ అవయవాలపై పెరుగుతుంది. ఇలా కణ జాలం పెరగడం కారణంగా కూడా నెలసరి సమయంలో నొప్పి, మంట, వాపు అనేవి వస్తూంటాయి. అలాగే ఫైబ్రాయిడ్లు కారణంగా కూడా పెల్విక్ నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి.
కండరాలపై ఒత్తిడి:
పీరియడ్స్ సమయంలో తిమ్మిరి, నొప్పి వంటిని తగ్గించడానికి.. స్త్రీలకు తెలియకుండానే.. వెన్ను కండరాలు ఒత్తిడికి గురి అవుతాయి. ఇలా దీర్ఘ కాలికంగా కండరాలు ఒత్తిడికి గురవడం వల్ల కూడా నడుము నొప్పికి దారి తీస్తుంది.
ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి:
– పీరియడ్స్ సమయంలో కండరాల ఒత్తిడిని తగ్గించడానికి, బ్యాక్ పెయిన్ తగ్గడానికి హీటింగ్ ప్యాడ్ ను నడుము పై ఉంచుకోవాలి. దీని వల్ల నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
– ఈ నొప్పి నుంచి రిలీఫ్ నెస్ పొందడానికి యోగా, పైలేట్స్ వంటి సున్నితమైన వ్యాయామాలు చేయాలి.
– నెలసరి సమయంలో టైట్ గా ఉండే బట్టలు కంటే.. కాస్త లూజ్ గా, సాఫ్ట్ గా ఉండే బట్టలను వేసుకోవడం మంచిది.
– మీరు స్ట్రెస్ కి గురైనప్పుడు కూడా ఈ వెన్ను నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి నెలసరి సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం బెటర్.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.