AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue: దోమ కుట్టిన తర్వాత ఎన్ని రోజులకు డెంగ్యూ వస్తుంది.. నివారించడం ఎలా..?

వర్షాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో ఆరోగ్యంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.. సీజనల్ వ్యాధులతోపాటు డెంగ్యూ ప్రమాదం పొంచిఉంటుంది.. వాస్తవానికి డెంగ్యూ ఆడ ఈజిప్టి (ఏడెస్ జాతి దోమ) దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమల జీవితకాలం కేవలం ఒక నెల మాత్రమే. కానీ ఈ కాలంలో అవి 500 నుంచి 1000 దోమలకు జన్మనిస్తాయి.

Dengue: దోమ కుట్టిన తర్వాత ఎన్ని రోజులకు డెంగ్యూ వస్తుంది.. నివారించడం ఎలా..?
Drinks for Dengue
Shaik Madar Saheb
|

Updated on: Jul 01, 2024 | 1:51 PM

Share

Dengue Fever Symptoms: వర్షాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో ఆరోగ్యంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.. సీజనల్ వ్యాధులతోపాటు డెంగ్యూ ప్రమాదం పొంచిఉంటుంది.. వాస్తవానికి డెంగ్యూ ఆడ ఈజిప్టి (ఏడెస్ జాతి దోమ) దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమల జీవితకాలం కేవలం ఒక నెల మాత్రమే. కానీ ఈ కాలంలో అవి 500 నుంచి 1000 దోమలకు జన్మనిస్తాయి. ఈ దోమలు మూడు అడుగులు మాత్రమే ఎగరగలవు. ఈ కారణంగా అవి మనిషి దిగువ అవయవాలను మాత్రమే టార్గెట్ గా ఉంచుకుంటాయి.. ఈ దోమలు కాటేస్తే.. తీవ్రమైన జ్వరంతోపాటు.. పలు సమస్యలు ఎదురవుతాయి..

డెంగ్యూ దోమలు కూలర్లు, పూల కుండీలు, పాత కంటైనర్లు లేదా ఇంటి పైకప్పులు, టైర్లు, గుంతలు మొదలైన వాటిలో గుడ్లు పెడతాయి. డెంగ్యూ దోమలు ఒకేసారి 100 నుంచి 300 గుడ్లు పెడతాయి. 4 రోజుల తర్వాత అవి దోమల రూపంలోకి మారతాయి. దోమల రూపం తీసుకున్న తర్వాత 2 రోజుల్లో ఎగరడం ప్రారంభిస్తాయి.

డెంగ్యూ దోమ కుట్టిన వెంటనే డెంగ్యూ లక్షణాలు కనిపించవు.. కానీ కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. ఏడిస్ దోమలు కుట్టిన 3 నుంచి 5 రోజుల తర్వాత డెంగ్యూ జ్వరం వస్తుంది. ఈ దోమలు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే సంచరిస్తాయి.. మిగతా సమయంలో డెంగ్యూ దోమలు వాటికి అనువైన ప్రదేశాల్లో ఇళ్ల మూలల్లో, తెరల వెనుక, దోమలు ఉండే ప్రదేశాల్లో దాక్కుంటాయి.

డెంగ్యూ జ్వరం లక్షణాలు ఇవే..

ఏడెస్ జాతి దోమ కాటు వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి డెంగ్యూ.. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. కానీ ఇది తీవ్ర రక్తస్రావ జ్వరానికి దారితీయవచ్చు. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..

తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై ఎర్రటి పొక్కులు, కళ్ల కింద నొప్పి, మోకాళ్ల నొప్పులు, వాపులు, దంతాలు, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం లాంటివి గమనిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి..

డెంగ్యూ నివారణ ఎలా:

  • వర్షాకాలంలో ముఖ్యంగా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి.
  • నిద్రపోయేటప్పుడు దోమతెరలను వాడండి..
  • దోమ కాటును నివారించడానికి బాడీ ఆయిల్ లేదా క్రీమ్ రాయండి.
  • మీ ఇంటిలో మరియు చుట్టుపక్కల మురికి నీరు చేరడాన్ని నివారించండి.
  • అనవసరమైన వస్తువులను అలాగే కూలర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
  • డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..