Egg: గుడ్డులో పచ్చసొన తినకూడదా…?
ప్రతిరోజూ కోడిగుడ్డు తినడం శరీరానికి విస్తృత ఆరోగ్య లాభాలను అందిస్తుంది. ఉడికించిన గుడ్డులో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కండర నిర్మాణం, ఎముకల బలం, రక్తహీనత నివారణ, కంటి ఆరోగ్యం, హృద్రోగ నియంత్రణ, విటమిన్ D లోపం నివారణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

పౌష్టికాహార లోపాన్ని అధిగమించాలనుకునే వారికి వైద్యులు ప్రతిరోజూ కోడి గుడ్డు తినడం సూచిస్తున్నారు. కోవిడ్-19 సమయంలో కూడా కోడిగుడ్ల వినియోగం బాగా పెరిగింది. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలనుకునే వారందరూ కోడిగుడ్డు తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు కూడా ప్రోత్సహించాయి. సాధారణంగా ఒక కోడిగుడ్డు సుమారు 65 గ్రాముల బరువులో ఉంటుంది. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. పరిశోధనలు సూచిస్తున్నట్లుగా, ఒక గుడ్డు 6.29 గ్రాముల ప్రోటీన్, 78 క్యాలరీలు అందిస్తుంది. గుడ్డులోని ప్రోటీన్ మరియు మాంసకృత్తులు శరీర ఆరోగ్యానికి, ముఖ్యంగా కండర నిర్మాణానికి, ఎంతో మేలు చేస్తాయి.
గుడ్డులో విటమిన్ A, జింక్, సెలీనియం, విటమిన్ E ఉంటాయి. ఇవి కంటి చూపు మందగించడం, శుక్లాలు రావడం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. గుడ్డులో విటమిన్ D అధికంగా ఉండటం వల్ల ఎండ తగలకపోవడం, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఏర్పడే సమస్యలను తగ్గించవచ్చు. గుడ్డులో కొలెస్ట్రాల్ సరైన పరిమాణంలో ఉండటం, HDL స్థాయిలు పెరగడం, ట్రైగ్లిజరైడ్ మోతాదు తగ్గించడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుడ్డులోని కోలిన్ కాలేయ, ధమనులు, నాడీ సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. గర్భిణులకు అవసరమైన కాల్షియంని అందించడంలో గుడ్డు మేలు చేస్తుంది.
గుడ్డు తెల్ల భాగంలో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల మహిళల ఎముకల బలాన్ని పెంచడంలో, ఆస్టియోపొరోసిస్ నివారణలో ఇది సహాయపడుతుంది. పచ్చసొనలోని కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వైద్యుల సూచన ప్రకారం, గుడ్డు మొత్తం తినడం మేలు చేస్తుంది. గుడ్డు తెల్లభాగం, పచ్చసొన రెండూ శరీరానికి సమగ్ర పోషణను అందిస్తాయి. కొంత కొవ్వు ఉండటం నిజమే, కానీ అది గుండెకు హానికరం కాకుండా, మంచి కొలెస్ట్రాల్ పెంపుకు తోడ్పడుతుంది.




