AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోమ కాటుతో హెచ్‌ఐవీ వస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

దోమలు డెంగ్యూ, మలేరియా వంటి చాలా రకాల రోగాలను వ్యాపింపజేస్తాయి. అందుకే ఇల్లు, చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎప్పుడూ చెబుతారు. అయితే దోమ కాటు వల్ల హెచ్‌ఐవీ కూడా వస్తుందని కొందరు అనుకుంటారు. ఇది నిజమేనా..? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

దోమ కాటుతో హెచ్‌ఐవీ వస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Mosquito
Prashanthi V
|

Updated on: Aug 28, 2025 | 10:13 PM

Share

నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. దోమలు హెచ్‌ఐవీ వైరస్‌ను ఒకరి నుండి మరొకరికి చేరవేయలేవు. ఎందుకంటే దోమ ఒకరిని కుట్టినప్పుడు వారి రక్తాన్ని మాత్రమే తాగుతుంది. కానీ ఆ రక్తాన్ని మరొకరికి ఎక్కించదు. మరో విధంగా చెప్పాలంటే.. దోమ సిరంజ్ (syring) లా పని చేయదు.

ఒకవేళ దోమకు హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తి రక్తం అంటినా.. అది మరొకరిని కుట్టినప్పుడు ఆ వైరస్‌ను లోపలికి పంపలేదు. ఎందుకంటే దోమ మనల్ని కుట్టినప్పుడు అది రక్తాన్ని కాకుండా దాని ఉమ్మిని మాత్రమే చర్మంలోకి విడుదల చేస్తుంది.

హెచ్‌ఐవీ ఎలా వ్యాపిస్తుంది..?

హెచ్‌ఐవీ అనేది కేవలం కొన్ని శరీర ద్రవాల ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వస్తుంది. అయితే ఆ వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకుని.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే దానిని కంట్రోల్ చేయొచ్చు.

  • సేఫ్‌టీ లేకుండా శారీరక సంబంధం పెట్టుకోవడం. దీని వల్ల వీర్యం లేదా యోని ద్రవాల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది.
  • ఒక వ్యక్తి నుంచి మరొకరికి రక్తం ఎక్కించేటప్పుడు (blood transfusion).
  • హెచ్‌ఐవీ ఉన్న తల్లి నుంచి బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు.
  • గాయాలు లేదా కోసుకుపోయిన చోట నుంచి రక్తం మరొకరికి సోకినప్పుడు.

అయితే డాక్టర్ల సలహాలు పాటిస్తే.. హెచ్‌ఐవీ ఉన్న తల్లులు కూడా తమ పిల్లలకు వైరస్ సోకకుండా పుట్టేలా చేయవచ్చు. ఇది చాలా మందికి తెలియని విషయం.

హెచ్‌ఐవీ నుండి రక్షణ 

  • సేఫ్ సెక్స్ చేయండి. ఎప్పుడూ రక్షణ ఉపయోగించండి.
  • హెచ్‌ఐవీ ఉన్నవారి శరీర ద్రవాలతో డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా జాగ్రత్త పడండి.
  • హెల్తీ లైఫ్‌స్టైల్ ఫాలో అయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

వారానికి 2 క్యారెట్లు తింటే.. జీవితంలో క్యాన్సర్‌ రాదట!
వారానికి 2 క్యారెట్లు తింటే.. జీవితంలో క్యాన్సర్‌ రాదట!
బీట్‌రూట్ Vs దానిమ్మ రసం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
బీట్‌రూట్ Vs దానిమ్మ రసం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సంప్రదాయం మాత్రమే కాదు.. జడ వేసుకుంటే.. మీ జుట్టుకి షీల్డ్..
సంప్రదాయం మాత్రమే కాదు.. జడ వేసుకుంటే.. మీ జుట్టుకి షీల్డ్..
స్క్రీన్ టైమ్ ఒక్క గంట పెరిగితే ఎంత ప్రమాదమో తెలుసా?
స్క్రీన్ టైమ్ ఒక్క గంట పెరిగితే ఎంత ప్రమాదమో తెలుసా?
మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
హిస్టరీ అంటే ఇంటరెస్ట్ ఉందా.? మీకు ఈ ప్లేసులు పక్కా నచ్చుతాయి..
హిస్టరీ అంటే ఇంటరెస్ట్ ఉందా.? మీకు ఈ ప్లేసులు పక్కా నచ్చుతాయి..
భారత్-పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో-హ్యాండ్‌షేక్ పాలసీ
భారత్-పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో-హ్యాండ్‌షేక్ పాలసీ
బరువు తగ్గాలా? మీ ఒళ్లును హరివిల్లులా వంచే పరాఠా పనీర్‌ తినేయండి
బరువు తగ్గాలా? మీ ఒళ్లును హరివిల్లులా వంచే పరాఠా పనీర్‌ తినేయండి
Jioలో 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ధర ఎంతో తెలుసా
Jioలో 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ధర ఎంతో తెలుసా