Gym Exercise: జిమ్ లో ఎక్సర్ సైజ్ చేయడం వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?
గత కొద్ది రోజులుగా గుండె పోటుతో మరణాలు బాగా ఎక్కువ అయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా 25 నుంచి 30 ఏళ్ల వయసు వారు కూడా హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. డ్యాన్సులు చేస్తూ, మాట్లాడుతూ, ఎక్సర్ సైజ్ చేస్తూనే గుండె పోటు వచ్చి అక్కడికక్కడే మరణిస్తున్నారు. అయితే అతిగా వ్యాయామాలు చేస్తేనే గుండె పోటుతో మరణిస్తున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. అదేంటి? వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది కదా.. కానీ ఎందుకు మరణిస్తున్నారు అనే డౌట్ రావచ్చు. అవును..

గత కొద్ది రోజులుగా గుండె పోటుతో మరణాలు బాగా ఎక్కువ అయ్యాయి. అది కూడా యువతే ఎక్కువగా మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా 25 నుంచి 30 ఏళ్ల వయసు వారు కూడా హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. డ్యాన్సులు చేస్తూ, మాట్లాడుతూ, ఎక్సర్ సైజ్ చేస్తూనే గుండె పోటు వచ్చి అక్కడికక్కడే మరణిస్తున్నారు. అయితే అతిగా వ్యాయామాలు చేస్తేనే గుండె పోటుతో మరణిస్తున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. అదేంటి? వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది కదా.. కానీ ఎందుకు మరణిస్తున్నారు అనే డౌట్ రావచ్చు. అవును శరీరానికి సరిపడా వ్యాయామం చేస్తే మంచిదే కానీ.. అతిగా చేస్తేనే అనర్థాలకు దారి తీస్తుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శక్తికి మించి వ్యాయామం చేసినప్పుడు:
కొంత మంది మొదటి రోజే ఎక్కువగా వ్యాయామం చేస్తూంటారు. ఇలా చేయడం చాలా తప్పు. మీరు ఎప్పుడైనా మొదటి రోజు ఎక్సర్ సైజ్ మొదలు పెట్టినప్పుడు చాలా తక్కువగా చేయాలి. తర్వాత కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్లాలి. వ్యాయామాలు చేసేటప్పుడు కండరాలు సరిగ్గా పని చేయాలంటే ఆక్సిజన్ ఎక్కువగా కావాలి. ఆక్సిజన్ ను ఎక్కువగా అందిచడానికి హార్ట్.. కండరాలకు రక్తాన్ని ఎక్కువగా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హార్ట్ ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
రెస్ట్ తీసుకోవాలి:
ఎప్పుడూ సామర్థ్యానికి మించి వ్యాయామం చేయకూడదు. వ్యాయామం చేసేటప్పుడు అలసటగా ఉంటే మధ్యలో రెస్ట్ తీసుకోవడం ఉత్తమం.
ఇలా అనిపిస్తే వైద్యున్ని కలవాలి:
జిమ్ లో వ్యాయామం చేసేటప్పుడు గుండెలో నొప్పి, అలసట, వికారం, తల నొప్పి, కళ్లు తిరిగినట్టుగా ఉండటం, కండరాల్లో నొప్పులు, ఊపిరి ఆడనట్టుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మేలు.
గుండెపోటు వస్తుందని వ్యాయామం మానకూడదు:
ఎక్సర్ సైజులు చేయడం వల్లనే గుండె పోటులు వస్తున్నాయని చాలా మంది వ్యాయామం చేయడం మానేస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల అందరికీ హార్ట్ ఎటాక్ రాదు. సామార్థ్యానికి మించి చేస్తేనే అనారోగ్యం కానీ.. వ్యాయామం చేయడం చాలా మంచిది. ఎక్సర్ సైజులు చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
సరైన ఆహారం తీసుకోవాలి:
వ్యాయామాలు చేసేటప్పుడు ఏది పడితే అది తినకూడదు. డైట్ ఫాలో అవ్వాలి. గుండెకు మంచి చేసే ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.