Health News: ఆకలి వేయడం లేదా? అసలు కారణం ఇదేనంటూ షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు..

Health News: మనం ప్రాణాలతో ఉండాలంటే ప్రాణవాయువు అయినా ఆక్సీజన్ ఎంత ముఖ్యమో.. ఆహారం, నీరు కూడా అంతే ముఖ్యం.

Health News: ఆకలి వేయడం లేదా? అసలు కారణం ఇదేనంటూ షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు..
Food
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 31, 2022 | 7:45 AM

Health News: మనం ప్రాణాలతో ఉండాలంటే ప్రాణవాయువు అయినా ఆక్సీజన్ ఎంత ముఖ్యమో.. ఆహారం, నీరు కూడా అంతే ముఖ్యం. ఫుడ్ తింటేనే మనుగడ సాగించగలం. లేదంటే చతికిలబడతారు. అయితే, అన్ని రకాల ఆహారాలు అందరి శరీరాలకు సరిపడవు. కొందరికి కొన్నిరకాల ఫుడ్ నచ్చితే.. మరికొందరికి మరికొన్ని రకాల ఫుడ్స్ నచ్చుతాయి. నచ్చని ఆహార పదార్థలను అస్సలు తినరు. వాటిని చూస్తే ఆకలి కూడా అనిపించదు. అయితే, మరికొందరైతే అస్సలు ఫుడ్డే తినరు. ఏమైందంటే.. ఆకలి వేయడం లేదని చెబుతుంటారు. అయితే, ఆకలి వేయకపోవడానికి అసలు కారణం వేరే ఉందంటూ ఆరోగ్య పరిశోధకులు చెబుతున్నారు. చాలా రోజులుగా ఆకలి వేయడం లేదంటే.. జాగ్రత్తగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. శరీరంలో అధిక ఒత్తిడి, ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వంటి కారణాల వల్ల ఆకలిగా అనిపించదట. న్యూట్రీషన్ బై లవ్‌నీత్ ప్రకారం ఆకలి లేకపోవడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1) మానసిక ఆందోళన.. మీరు ఆత్రుతగా, ఆందోళనగా ఉన్నప్పుడు కేంద్ర నాడీ వ్యవస్థ ఒక రకమైన ఒత్తిడికి గురి చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ అవాంఛిత హార్మోన్లు మీ జీర్ణక్రియ, ఆకలిని మందగించడంతో సహా అనేక విధాలుగా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి.

2) డిప్రెషన్.. డిప్రెషన్ కూడా ఆకలి లేకుండా చేస్తుంది. ఈ మానసిక ఆరోగ్య పరిస్థితి మీ మెదడును మరింత కార్టికోట్రోపిన్ విడుదల కారకాన్ని (CRF) విడుదల చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది తక్కువ ఆకలిని కలిగించే ఒక రకమైన హార్మోన్.

3) ఒత్తిడి.. ఒత్తిడి కొన్నిసార్లు మీ ఆకలిని తగ్గిస్తుంది. ఇది వికారం, అజీర్తి వంటి శారీరక సమస్యలను కలిగిస్తుంది. ఆహారం తినాలనే కోరికకు ఆటంకం కలిగిస్తుంది.

4) అనారోగ్యం.. ఆరోగ్యం సరిగా లేనప్పుడు కూడా ఈ సమస్య ఎదురవుతుంది. ఆహారం తినాలనే కోరిక పూర్తిగా తగ్గిపోతుంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు విడుదలయ్యే సైటోకిన్ అనే రసాయనం వ్యక్తులను అలసిపోయేలా చేస్తుంది. ఏదీ తినాలని అనిపించదు.

5) గర్భవతిగా ఉన్నప్పుు.. గర్భవతి అయినప్పుడు స్త్రీల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఈ పరిస్థితి వారిలో ఆకలిని తగ్గిస్తుంది. వికారం వంటి సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని గర్భధారణ లక్షణాలు వికారం, గుండెల్లో మంటను కలిగిస్తాయి. తినే ఆహారాలపై అయిష్టం కలిగిస్తాయి.

6) దీర్ఘకాలిక నొప్పులు.. శరీరంలో ధీర్ఘకాలిక నొప్పులు ఉన్నట్లయితే.. ఇది అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆకలిని కూడా చంపేస్తుంది.

7) మందులు.. కొన్నిసార్లు మందులు కూడా దుష్ప్రభావాలను చూపుతాయి. మందులు వేసుకున్న తరువాత ఆకలిగా అనిపించదు.

8) వయస్సు.. చిన్న పిల్లలు, యుక్త వయస్కులు చాలా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. కానీ వృద్ధాప్యంలో జీర్ణవ్యవస్థ మందగించడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో తక్కువ ఆకలి ఉంటుంది.

(గమనిక: ఈ చిట్కాలు సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తాయి. మీకేమైనా అనారోగ్య సమస్యలుంటే.. అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయం తీసుకోవడం ముఖ్యం. దీనిని టీవీ9 తెలుగు నిర్ధారించలేదు.)

Also read:

Astro Tips: ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా?.. యాలకులతో ఇలా చేస్తే డబ్బే డబ్బు..!

Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. వివరాలివే..!

Big News Big Debate: 40 ఏళ్ల తెలుగుదేశం.. భవిష్యత్తుకు ఏది అభయం.. ప్రత్యేక కథనం..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!